రాష్ట్రీయం

ఒక్క దరఖాస్తు చాలు.. అనుమతులు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 17: నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులు, అనుమతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి అవినీతి, బంధుప్రీతి అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని స్పష్టం చేశారు. కేవలం ఒకే ఒక్క దరఖాస్తుతో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. తమ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తారని ప్రకటించారు. ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించటమే కాదు పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, విద్యుత్ సమకూర్చుతుందని వివరించారు. రాష్ట్రంలో సువిశాలమైన సముద్రతీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డీశాలినేషన్, మెట్రోరైళ్లు, బకింగ్‌హాం కాల్వ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతిలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నాణ్యత, అధిక దిగుబడులు సాధించటానికి తాముచేసే ప్రయత్నాల్లో పాలు పంచుకోవాలని కోరారు. తమ ప్రాధాన్యత రంగాలన్నీ పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని గాడిలో పెడుతున్నామని ప్రతి ప్రభుత్వాస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మావన వనరులను అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ ప్రోడర్ ప్రారంభోపన్యాసం చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన విజయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏర్పడిన బలమైన నాయకత్వం అమెరికా- ఆంధ్రప్రదేశ్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలదని ఆకాంక్షించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలనే భారత్ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్ జగన్ సాధించిన మెజారిటీ చారిత్రాత్మకమని అభివర్ణించారు. అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారులు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రంగా గుర్తించాయన్నారు. తొలుత ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ సమావేశంలో కీలక అంశాలను వివరించారు. విద్యుత్ ఒప్పందాల పునస్సమీక్షతో విద్యుత్ పంపిణీ సంస్థలు నిలదొక్కుకుంటాయని తద్వారా పరిశ్రమలపై విద్యుత్ చార్జీల భారం తగ్గుతుందన్నారు. గోదావరి- కృష్ణా నదుల అనుసంధానం, కడపలో స్టీల్ ప్లాంట్, కోస్తా తీరంలో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్, బకింగ్‌హాం కెనాల్ పునరుద్ధరణ తదితర కీలక ప్రాజెక్ట్‌లను తమ ప్రభుత్వం లక్ష్యాలుగా ఎంచుకుందని తెలిపారు. తన పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2.2 కోట్ల మంది ప్రజల్ని స్వయంగా కలుసుకుని సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి వాటిని అమలు చేస్తున్నారని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేశారన్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలనకు దృఢసంకల్పంతో ఉన్నారన్నారు. కాంట్రాక్ట్‌లు, ప్రభుత్వ కొనుగోళ్లలో అవినీతికి తావు లేని విధానాలను అవలంబిస్తున్నారని వివరించారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణిష్ చావ్లా, నికాంత్ అవహద్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
చిత్రం... యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి