రాష్ట్రీయం

కరకట్టపై హై‘టెన్షన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 16: కృష్ణానది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం హై టెన్షన్ నెలకొంది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తడంతో కరకట్ట దిగువ భాగాన ఉండవల్లి వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్స్‌లోకి కూడ వరద నీరు చొచ్చుకొస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు నివాసం పరిసరాల్లో రెండు డ్రోన్లు చెక్కర్లు కొట్టాయి. ఈ సమాచారం తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను టీడీపీ నేతలు, కార్యకర్తలు నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. చంద్రబాబు నివాసంపై బాంబు దాడికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఉండే కిరణ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకే డ్రోన్లను ఎగురవేసినట్లుగా పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారని టీడీపీ నేతలు
ఆరోపించారు. కుట్ర వెనుక బాధ్యుల్ని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని, చంద్రబాబుకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కరకట్టపై ఆందోళనకు దిగారు. పోలీసులకు అప్పగించిన ఇద్దరు వ్యక్తులను వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. దీని వెనుక కుట్రదారులను బయటపెట్టాలని నినాదాలు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తదితరులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆరోపిస్తూ కరకట్ట నుంచి చంద్రబాబు నివాసం వరకు బైఠాయింపు జరిపారు. వరద నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాబు నివాసంపై కుట్ర పూరితంగానే ద్రోన్లను వదిలారని నినాదాలు చేశారు. బైఠాయింపు కారణంగా కరకట్టపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య అక్కడికి చేరుకుని హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబు నివాసంపై ఉద్దేశ పూర్వకంగానే ద్రోన్లను వదిలారని ఆరోపించారు. ఈలోగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదంతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసి కార్యకర్తలను చెదరకొట్టారు. లాఠీ చార్జిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయాలయ్యాయి. మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నా భద్రతనే ప్రశ్నార్థకం చేస్తారా: చంద్రబాబు
తన నివాసంపై డ్రోన్లు ఎగరటం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైదరాబాద్ నుంచి డీజీపీ గౌతం సవాంగ్, గుంటూరు జిల్లా ఎస్పీలకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎలా ఎగురవేస్తారంటూ నిలదీశారు. అసలు డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులెవరు.. అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు. డీజీపీ, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా ఎగగరేస్తారని మండిపడ్డారు. ‘నేనుండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు.. వరద పేరుతో రాజకీయం చేస్తారా.. నా భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్నారు.. హై సెక్యూరిటీ జోన్‌లో అధికార మదంతో ఆటలాడతారా అని ధ్వజమెత్తారు. డ్రోన్లు ఎగురవేస్తూ పట్టుబడిన వ్యక్తులెవరు.. ఆ డ్రోన్లలో ఏముంది.. నిఘా పెట్టిందెవరు.. దాని వెనుక కుట్ర ఏమిటనేది తక్షణమే విచారించి జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా నదీ పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ద్రోన్లను వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లను వినియోగించామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరకట్ట ప్రాంతంలో తీసుకోవాల్సిన భద్రత, ఇతరత్రా పరిస్థితులను అంచనా వేసేందుకు వీటిని వినియోగించామని, గత మూడు రోజులుగా డ్రోన్లతోనే పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.