రాష్ట్రీయం

శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఆగస్టు 16: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 6,60,333 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 89,996 క్యూసెక్కులు కలిపి మొత్తం 7,50,329 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరింది. ఇదే సమయానికి డ్యాం నీటిమట్టం 881.60 అడుగులుగా నమోదుకాగా 196.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం పది గేట్లను 42 అడుగుల నుంచి 34 అడుగులకు తగ్గించి నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం బ్యాక్‌వాటర్ ద్వారా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 30,362 క్యూసెక్కులు, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుంచి 38,140 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి 8,18,797 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.