రాష్ట్రీయం

సోలాపూర్ వరకే ముంబయ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: దేశ ఆర్థిక రాజధాని ముంబయని ఇంకా భారీ వర్షాలు వీడడంలేదు. దీంతో ముంబయ వెళ్ళే రైళ్లు సోలాపూర్ వరకు నడిపిస్తన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు చేపడుతున్నందున ముంబయ - సోలాపూర్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ముంబయ వెళ్ళే రైళ్లను ఈనెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోలాపూర్- వాడీ సెక్షన్ల మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. విశాఖపట్నం- ముంబయ - విశాఖపట్నం ( 18519- 18520) రైళ్లను రద్దు చేశారు. ముంబయ - విశాఖపట్నం మధ్య నడిచే రైల్ళను ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. నాగర్‌కోయిల్- ముంబయ - నాగర్‌కోయిల్ ( 16340- 16339) మధ్య నడిచే రైళ్లను ఈనెల 23వ తేదీ వరకు రద్దు చేశారు. అమృత్‌సర్- హెచ్‌ఎస్ నాందేడ్ ( 12422) మధ్య నడిచే రైళ్లను సెప్టెంబర్ 2వ తేదీన రద్దు చేశారు. గుంటూరు- ద్రోణాచలం (డోన్) (57328- 57327) మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ రైళ్లను ఈనెల 21వ తేదీ వరకు రద్దు చేశారు. పిడుగురాళ్ళ- శ్రీకాళహస్తి మధ్య నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త రైల్వే మార్గంలో శావల్యపురం వద్ద ట్రాక్ పనులు చేపట్టడంతో గుంటూరు - ద్రోణాచలం మధ్య నడిచే ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. రేపల్లి- మార్కాపురం మధ్య నడిచే డెమూ ప్యాసింజర్ రైలును ఈ నెల 20 వ తేదీ వరకు రద్దు చేశారు.