రాష్ట్రీయం

ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కానున్న గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం గడువు ముగిసిన తర్వాత వాటి పరిశీలన పూర్తి అయింది. రెండు నామినేషన్లు దాఖలు చేయగా రెండో వ్యక్తి భోజ్‌రాజ్ కోయల్కర్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈయన అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యేలల ప్రతిపాదన లేకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవం అయినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించడం ఇక లాంఛనప్రాయమే.