రాష్ట్రీయం

అనారోగ్యశ్రీయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిలిచిపోయిన చికిత్సలు
* మంత్రి ఈటల చర్చలు విఫలం
* ఇవ్వాల్సింది రూ. 600 కోట్లు: ప్రభుత్వం
* కాదు 1200 కోట్లు: నెట్ వర్క్ ఆస్పత్రులు

హైదరాబాద్, ఆగస్టు 16: ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీచేసి, అనారోగ్యశ్రీగా మారింది. బకాయిలను సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంగా రాష్టవ్య్రాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, ఉద్యోగులు, పాత్రికేయులకు అందించే వైద్య సేవలు, చికిత్సలను నెట్ వర్క్ ఆస్పత్రులు శుక్రవారం నుంచి నిలిపివేశాయి. తమకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయి పడిన మొత్తాన్ని చెల్లిస్తేతప్ప ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలను ఆందించలేమని నెట్ వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. దీంతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగి శుక్రవారం దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రుల యాజమన్యాలతో చర్చలు జరిగినప్పటికీ ఫలించలేదు. తమకు రూ. 1,200 కోట్లు ప్రభుత్వం బకాయిపడిందని నెట్‌వర్క్ ఆస్పత్రులు అంటుండగా, తాము చెల్లించాల్సిన పాత బకాయిలు కేవలం రూ. 600 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వ లెక్కలకు, నెట్‌వర్క్ ఆస్పత్రుల లెక్కలకు పొంతన కుదరక పోవడంతో చర్చలకు ప్రతిష్టంభన ఏర్పడింది. తమ వద్ద ఉన్న రికార్డులను మరోసారి పునర్ పరిశీలిస్తామని, అప్పటి వరకు ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని మంత్రి ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తికి నెట్‌వర్క్ ఆస్పత్రులు సానుకూలంగా స్పందించలేదు. తమకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు సేవలను నిరాకరిస్తున్నట్టు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం సేవలను ఎప్పటి మాదిరిగా కొనసాగిస్తామని, బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నెలలో పాత బకాయిలకు సంబంధించి రూ. 200 కోట్లు విడుదల చేస్తాం వైద్య సేవలు కొనసాగించాలని మంత్రి ఈటల కోరగా తమకు కనీసం రూ. 500 కోట్లు విడుదల చేయాలని ఆస్పత్రులు డిమాండ్ చేశాయి. ఇప్పటికే రూ. 300 కోట్లు విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేయగా బకాయిపడిన రూ.12 వందల కోట్లలో 200 కోట్లు ఏ మూలకు సరిపోతాయని నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రశ్నించాయి. తమ వద్ద రికార్డుల ప్రకారం బకాయిపడింది కేవలం 600 కోట్లు మాత్రమేనని అధికారులు లెక్కలు చూపించారు. బకాయిల లెక్కలకు ప్రభుత్వానికి, నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమన్యాలకు మధ్య పొంతన కుదరకపోవడంతో తిరిగి మరోసారి చర్చిద్దామని ప్రభుత్వం సూచించడంతో అర్థాంతరంగా చర్చలు ముగిశాయి. ఇలావుండగా చర్చల తర్వాత మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు చెప్పే లెక్కల్లో వాస్తవం లేదన్నారు. తాము బకాయిపడింది కేవలం ఆరు వందల కోట్లు మాత్రమేనన్నారు. వీటిని కూడా ఒకేసారి కాకుండా దశల వారీగా చెల్లిస్తామన్నారు. వరుసగా ఎన్నికల కోడ్ ఉండటంతో పాత బకాయిల చెల్లింపులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల సమ్మెను తాము తాత్కాలిక సమ్మెగానే పరిగణిస్తున్నామన్నారు. బకాయిల చెల్లింపు పేరిట ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేయడం సరైందని కాదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెల్లిస్తున్న సేవలకు ఖరారు చేసిన ఫీజులను పెంచాలని నెట్‌వర్క్ ఆస్పత్రుల డిమాండ్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మంత్రి వివరించారు.