రాష్ట్రీయం

అస్మదీయులకు అందలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నామినేటెడ్ పదవుల భర్తీకి కేసీఆర్ శ్రీకారం
* రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్
* కేబినెట్ మంత్రి హోదా
* బడ్జెట్ ప్రతిపాదనల బాధ్యత అప్పగింత
* వారంలో రోజుల్లో రాష్టస్థ్రాయి పోస్టుల భర్తీ

హైదరాబాద్, ఆగస్టు 16: అస్మదీయులను అందలాలు ఎక్కించడం ద్వారా, ఒకవైపు న్యాయం చేస్తూనే మరోవైపు ‘అసంతృప్తి’ సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే, నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు. నామినేటెడ్ పోస్టులలో కీలకమైన, కేబినెట్ ర్యాంక్ కలిగిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టస్థ్రాయి హోదా కలిగిన నామినేటెడ్ పదవుల భర్తీ చేయడంతో, వారం రోజుల్లో మరికొన్ని కీలకమైన పోస్టుల భర్తీని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆర్టీసీ చైర్మన్, మిషన్ భగీరథ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వంటి రాష్టస్థ్రాయి పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇలావుంటే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన వినోద్ కుమార్‌కు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించినట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రిమండలికి శాశ్వత ఆహ్వానితునిగా ఉంటారని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి ప్రతిపాదనలను రూపొందించే కీలక బాధ్యతను కూడా వినోద్ కుమార్‌కు అప్పగించినట్టు సీఎం తెలిపారు. రాజకీయ, పరిపాలనా అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఆయన్ను నియమించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాగా, నామినేటెడ్ పదవుల పందేరానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడంతో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఓడిపోయిన ముఖ్య నేతలు కీలకమైన పదవులలో తమను భర్తీ చేయాలని పార్టీ అధిష్టానంపై వత్తిడి పెంచే అవకాశం ఉంది. పార్టీ ముఖ్య నేతలు కొందరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిసి తమ పేర్లను సిఫారసు చేయాల్సిందిగా ఒత్తిడి పెంచినట్టు సమాచారం. రాష్టస్థ్రాయి పదవులను ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. అలాగే రాజ్యిసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేస్తే, ఆ స్థానంలో తమను ఎంపిక చేయాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.