రాష్ట్రీయం

తగ్గిన తుంగభద్ర ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 15: శ్రీశైలం జలాశయానికి తుంగభద్ర నది ద్వారా వస్తున్న వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో కృష్ణానది వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి గురువారం రాత్రి 7,27,321 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి 6,77,689 క్యూసెక్కులు, తుంగభద్ర నది నుంచి సుంకేసుల బ్యారేజ్ ద్వారా 49,632 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుతోంది. ఇందులో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29,722 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు, 10 క్రస్ట్‌గేట్లను 37 అడుగుల మేర ఎత్తి 7,56,220 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు పంపుతున్నారు. జలాశయం ఎగువన తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, ఏపీలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎత్తిపోతల పథకానికి 225 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 35 వేల క్యూసెక్కులు కలిపి మొత్తం 8,61,907 క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి బయటకు పంపుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 881.8 అడుగులుగా, నీటినిల్వ 197.91 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో ఒకటి లేదా రెండు గేట్లను దించే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
చిత్రం...శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తిన దృశ్యం