రాష్ట్రీయం

మట్టపల్లి నృసింహునికి పులిచింతల ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి, ఆగస్టు 15: భక్తుల కోరిన కోరికలు తీర్చే మట్టపల్లి నర్సింహ్మా స్వామికి పులిచింతల ముప్పు వచ్చింది. నిత్యం స్వామి నామస్మరణతో మారుమోగే ఆలయంలో కరకట్ట లీకేజీల ద్వారా వరద నీరు వస్తుండూంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
2009 వరదల తరువాత పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా నదిలో 40 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా కరకట్టను నిర్మించారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న ఈ ఆలయం స్వయంభు కావడంతో తరలించేందుకు వీలుకాక 2 కోట్ల రూపాయలతో కరకట్టను నిర్మించారు. సరిగ్గా 10 సంవత్సరాల తరువాత భారీగా వరద నీరు చేరడంతో ఆలయం వద్ద నిర్మించిన కరకట్టకు లీకేజీల ద్వారా ఆలయంలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఆలయ అధికారులు మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నా నీరు తగ్గకపోవడంతో స్వామి వారి దర్శనాలను నిలిపివేసి ఉత్సవమూర్తుల దర్శనాలకే పరిమితం చేస్తున్నారు. వరద నీరు ఆలయాన్ని చుట్టుముట్టడంతో పాటు కేవలం ఒక మీటర్ దూరంలోనే కరకట్ట ఉండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. రెవిన్యూ, పోలీస్, ఐబీ అధికారులు వచ్చి పరిస్థితులను సమీక్షించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలయ పరిరక్షణకు చర్యలు చేపట్టి ఆలయాన్ని కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆలయంలోకి భారీగా నీరు చేరడంతో పరిస్ధితిని గురువారం సూర్యాపేట జేసీ సంజీవరెడ్డి పరిశీలించారు.

చిత్రం...మట్టపల్లి ఆలయంలోకి పెద్దఎత్తున చేరుతున్న వరద నీరు