రాష్ట్రీయం

మజ్లిస్‌కు మోకరిల్లుతూ.. తెలంగాణకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వచ్చే నెల, సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవం రోజున కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ మజ్లిస్‌కు మోకరిల్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గురువారం ఇక్కడ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చినా, హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు రాజుల పాలన కొనసాగిందన్నారు. ఆ నాటి హోంశాఖమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఈ సంస్థానం భారత్‌లో విలీనమైందన్నారు. కానీ, ఇంతవరకు తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేక పోతున్నామన్నారు. ఈ విమోచన దినోత్సవం జరిపితే రజాకార్ల ఆగడాలు బహిర్గతమవుతాయని, దీని వల్ల మజ్లిస్ నొచ్చుకుంటుందని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు. తమ పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 20 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ప్రాంతీయ, కులతత్వ రాజకీయాలకు పాతరవేసేందుకు తమ పార్టీకి ప్రజలు పెద్ద మెజారిటీ ఇచ్చారన్నరు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన రాజ్యమేలుతోందన్నారు. కానీ, ఈ రోజు ఎవరికీ స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. టీఆర్‌ఎస్‌లో కూడా ప్రజాస్వామ్యం లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉండగా, కుమారుడు కేటీఆర్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారన్నారు. చంకలో మతోన్మాద పార్టీని పెట్టుకుని పరమతసహనం గురించి మాట్లాడుతున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం బీజేపీ వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీజేపీ చేస్తున్న ప్రజాస్వామ్య యజ్ఞానికి మేము సైతం అంటూ అనేక మంది నేతలు, ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. అమిత్‌షా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని స్వేచ్ఛగా ఆనందోత్సవాలతో జరుపుకునేందుకు బీజేపీతో కలిసి రావాలని ఆయన కోరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ బీజేపీ వల్లనే 370వ అధికరణ రద్దు సాధ్యమైందన్నారు. కాశ్మీర్‌లో పౌర హక్కులు, రిజర్వేషన్లు ఉండేవి కావన్నారు. కానీ, కేంద్రం చొరవ వల్ల కాశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలులోకి వస్తాయన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం తెలంగాణ సమాజం పోరాడుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్లాలని తమ పార్టీ ఆకాంక్షిస్తోందన్నారు. జాతీయవాదాన్ని సమాధి చేసేందుకు జరుగుతున్న కుట్రలను బీజేపీ అడ్డుకుంటుందన్నారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులు మాట్లాడారు.

చిత్రం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్