రాష్ట్రీయం

తెలంగాణకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి బేసిన్‌తో పాటు చెరువులు కూడా కళకళలాడుతున్నాయి. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు రెండోవారం వరకు కురిసిన భారీ వర్షాలతో చెరువులు నిండకుండలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 43,764 చెరువులు ఉన్నాయి. వీటి మొత్తం నీటి నిల్వసామర్థ్యం 256 టీఎంసీలు. తాజాగా కురిసిన వర్షాల వల్ల 3,589 చెరువుల్లో నీరు పొంగిపొరుతున్నది. దీంతో చెరువు ఆయకట్టు రైతులు హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు. 6,048 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీటి ప్రవాహం చేరింది. 3,112 చెరువుల్లో 50 నుంచి 75 శాతం వరకు నీటి నిల్వ ఉంది. 4843 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు నీరు వచ్చాయి. 26,172 చెరువుల్లో 25 శాతం వరకు నీటి నిల్వ చేరింది. గోదావరి బేసిన్‌లోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో చెరువులు కళకళలాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 2,772 చెరువులకుగాను 1,116 చెరువులు నిండి పొర్లు తున్నాయి. 1,311 చెరువుల్లో దాదాపు 75 శాతం నీరు చేరినట్లు మైనర్ ఇరిగేషన్ అధికారులు చెప్పారు. మిషన్
కాకతీయ 1, 2, 3 దశల కింద చెరువుల పూడిక తీయడం, మరమ్మతు పనులను రాష్ట్రప్రభుత్వం పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం విదితమే. దీని వల్ల అదనంగా పది టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చెరువులు నిండడం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జల లభ్యత కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రం మొత్తం మీద ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాల వల్ల చెరువులు నిండాయని, రైతులకు లాభం చేకూరినట్టు మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్పారు.