రాష్ట్రీయం

త్వరలో కొత్త రెవెన్యూ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగించని విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించారు. భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కోండ కోట వద్ద గురువారం జరిగిన రాష్టస్థ్రాయి వేడుకలో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. గోల్కొండ కోట రాణిమహల్ లాన్స్‌లో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. ప్రజలకు సులువుగా, అవినీతికి అవకాశం ఉండకూడదన్న లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టం రూపొందుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకువస్తామన్నారు. మొత్తం మూడు చట్టాలు కొత్తగా వస్తున్నాయని చెబుతూ, పంచాయతీరాజ్ చట్టం, పురపాలక చట్టాలను ఇటీవలే తీసుకువచ్చామన్నారు. రెవెన్యూ చట్టం కూడా వీలైనంత త్వరలోనే అమల్లోకి తెచ్చేందుకు కృషి
చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ తన ప్రసంగంలో మొదట ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగధనులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి గత ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో తెలంగాణ ముందు వరుసలో నిలవడం ముదావహమని అన్నారు. 2014-15లో 4 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉండగా, నేడు 8.66 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని ఆయన అన్నారు. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని తమ ప్రభుత్వం ఆకర్షించగలిగిందని, శాంతి, భద్రతలు సజవుగా కొనసాగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. అవినీతిని అంతమొందించడం కోసం, సుపరిపాలనకోసం, గ్రామాలు, పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకోసం సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చామని, దీని వల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయన్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగానే ఇకనుండి ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక కమిషన్ గ్రాంట్లను 60 రోజుల ప్రణాళిక అమలుకన్నా ముందే స్థానిక సంస్థలకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 60 రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పిచ్చిమొక్కలను తొలిగించడం, కూలిపోయిన ఇళ్ల శిథిలాలను తొలిగించడం, పాడుబడ్డ బావులు, పనిచేయని బోర్‌బావులను పూడ్చివేయడం, విద్యుత్ సరఫరా సమర్థంగా ఉండేలా చర్యలు తీసుకోవడం, సమస్యలు ఉంటే పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి ఉంటుందన్నారు. హరితహారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.జిల్లాస్థాయి హరితహారం కమిటీలను ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం ప్రధాన అంశాలన్నారు. డబ్బుతో వానలను, స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతతను కొనలేమని, పచ్చని చెట్ల వల్లనే ప్రశాంతత లభిస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉందన్నారు. పంచాయతీరాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగ ఖాళీలను వేగవంతంగా భర్తీ చేస్తామన్నారు. కొత్త పంచాయతీ చట్టం, మున్సిపాలిటీ చట్టాలను అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే విద్యుత్ లోటును అధిగమించామని, పవర్‌కట్ లేని విధంగా విద్యుత్తును ప్రజలకు అందించగలుతున్నామన్నారు‘మిషన్ భగీరథ’ ద్వారా ప్రతి ఇంటికీ నల్లాద్వారా నీటిని ఇస్తున్నామని, ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులను పునరుద్ధరించామన్నారు. ప్రజలకు తాను ఇచ్చిన హామీకి అనుగుణంగా దివ్యాంగులకు 3016 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తున్నామని, ఇతరులకు 2016 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తున్నామన్నారు. వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించామని, పింఛన్ ఇచ్చేందుకు అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికార యంత్రంగం ఉందన్నారు. మన సేద్యం విధానం ఆదర్శవంతం తమ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ విధానం మొత్తం దేశానికే ఆదర్శంగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా అంతర్జాతీయంగా అమలవుతున్న గొప్ప కార్యక్రమమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకు పంటల రుణాల మాఫీ కోసం ఆదేశాలు జారీ చేశామన్నారు.
అబ్బురపడేలా కాళేశ్వరం నిర్మాణం
ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇంత భారీ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సాధారణంగా 15-20 ఏళ్లుపడుతుందన్నారు. కాళేశ్వరం ద్వారా 400 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందని, ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, వరంగల్ జిల్లాకు నీటిని ఇచ్చేందుకు ఉద్దేశించిన దేవాదుల ద్వారా 75 టీఎంసీల గోదావరి నీటిని నికరంగా వాడుకునే అవకాశం వచ్చే సంవత్సరం జూన్ నుండి కలుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వేగంగా నిర్మించి మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 11,20,000 ఎకరాలకు నీటిని ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘జీవించు-జీవించనివ్వు’ విధానం అన్ని రాష్ట్రాలకు అనుసరణీయంగా మారిందన్నారు. అన్ని కులవృత్తుల వారికి, దళితులకు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, జర్నలిస్టులు, న్యాయవాదులు తదితరులు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు 52 వేల కోట్ల నుండి 1,10,000 కోట్ల రూపాయలకు చేరడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రగతికి చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రజలు భాగస్వామ్యం కావాలని కేసీఆర్ పిలుపు ఇచ్చార

చిత్రాలు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగాగోల్కొండ కోటలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కీసీఆర్
* త్రివర్ణ పతాక దుస్తులతో విద్యార్థుల ప్రదర్శన