రాష్ట్రీయం

వీడని ముడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్ గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగురవేసిన జాతీయ పతాకం సగమే ముడివీడింది. గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట రాణిమహల్ లాన్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద జాతీయ పతాకం కర్రను ఏర్పాటు చేశారు. కేసీఆర్ వేదికపైకి రాగానే తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ పతాకం పైభాగాన ఉండే కాషాయం రంగు, తెలుపు రంగు భాగం వరకు ముడి సరిగ్గానే వీడింది. ఆ తర్వాత ఆకుపచ్చ రంగు భాగం ముడి వీడలేదు. ఈ సందర్భంగా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. జాతీయ పతాకం సగభాగమే ఎగిరిన తర్వాత తాడును కర్రకు అలాగే కట్టివేశారు. పతాకానికి సెల్యూట్ చేసి, జాతీయ గీతాలాపన చేశారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఆయన ప్రసంగం కొనసాగిన 20 నిమిషాల వరకు కూడా పతాకం సగభాగమే గాలిలో ఎగురుతూ కనిపించింది.