రాష్ట్రీయం

పోలవరం ‘రివర్స్’కు 17న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదిక నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 60సి నిబంధన కింద గంపగుత్తగా నవయుగ సంస్థకు పనులు కేటాయించడంపై అభ్యంతం వ్యక్తం చేస్తూ నివేదిక అందచేసింది. భారీగా అవకతవకలు జరిగాయన్న నివేదిక నేపథ్యంలో నవయుగ సంస్థను పోలవరం పనుల నుంచి తప్పుకోమంటూ ప్రీ-క్లోజర్ నోటీసులను ఆగస్టు 1న అందచేసింది. హెడ్‌వర్కు పనుల్లో భాగమైన స్పిల్‌వే, స్పిల్‌వే చానల్, కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, జల విద్యుత్ కేంద్రం ఫౌండేషన్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో టెండర్లను పిలువనుంది. రూ.5070 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలువనుంది. రివర్స్ టెండరింగ్ వల్ల పనుల్లో జాప్యం సహా, నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇటీవల వ్యాఖ్యానించింది.