రాష్ట్రీయం

సమష్టిగా పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఉద్యోగులంతా దృఢ సంకల్పంతో కలిసి పని చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. 73వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం నగరంలోని విద్యుత్ సౌధలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలపాలని కోరుకుంటోందని చెప్పారు. డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తున్న ఖర్చు, వాటికి వస్తున్న రాబడి కంటే ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 20వేల కోట్లకు చేరాయన్నారు. గడిచిన రెండేళ్లలో వార్షిక ఆదాయ వ్యత్యాసం రూ. 3వేల కోట్ల నుంచి రూ. 7వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి డిస్కంల నష్టాలు రూ. 14వేల కోట్లుగా ఉన్నాయని కార్యదర్శి చెప్పారు. విద్యుత్ రంగంలో ‘నవరత్నాలు’ అమలుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మూడు పథకాలు అమలు చేయడం ద్వారా నలభై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం వల్ల 18.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకం అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ. 1700 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ. 6881 కోట్లు కేటాయించగా ఇందులో ప్రత్యేకంగా రూ. 4525 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసమే కేటాయించారని తెలిపారు. ఏపీ జెన్కో 2019-20లో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ 5 (800 మెగావాట్లు), ఎస్డీఎస్టీపీఎస్ కృష్ణపట్నం, ఏపీపీడీసీఎల్ స్టేజ్ 2 (800 మెగావాట్లు)లను ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్నో ఎండీ బీ శ్రీ్ధర్, ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్ బాబు, పీ ఉమాపతి, జెన్కో డైరెక్టర్లు జీ ఆదినారాయణ, జీ చంద్రశేఖర్‌ఱాజు, బీఏ మోహన్‌రావు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు భారీ ఎత్తున విద్యుత్ సంస్థల ఉద్యోగులు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిత్రం...జాతీయ పతాకానికి వందనం చేస్తున్న ఇంధనశాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్