రాష్ట్రీయం

వలంటీర్లే అంబాసిడర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: గ్రామ, వార్డు వలంటీర్లే ప్రభుత్వం తరఫున అంబాసిడర్లు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తన స్వరం వారి నోటి వెంట రావాలని, బాగా పని చేసిన వలంటీర్లను నాయకులను చేస్తానని ప్రకటించారు. విజయవాడలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను గురువారం ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లోని వలంటీర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక్కో వలంటీర్ 50 కుటుంబాల బాధ్యత తీసుకుని, మన వాళ్లు అనుకోవాలని సూచించారు. కష్టాల్లో ప్రజలకు తోడుగా ఉన్నామన్న భావన కల్పించాలన్నారు. వివిధ పథకాలకు దరఖాస్తు చేయడంలో, వాటిని ఇంటికి తీసుకువెళ్లి అందచేయడంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ కొన్ని గ్రామాలు స్వాతంత్య్రం దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితిని గ్రామాల్లో చూస్తున్నామన్నారు. తన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానని, కష్టాలు ఉండటం సహజమేనన్నారు. కష్టాలు పోయే రోజు త్వరలో రానుందన్నారు. కష్టాలను ప్రభుత్వం తీర్చకపోతే ప్రజలు హర్షించరన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఉందన్న నమ్మకం, విశ్వాసం కల్పించాలన్నారు. లంచాలు లేని, వివక్ష లేని, కుల, మత, వర్గ భేదాలు లేని వ్యవస్థ తీసుకురావాలని భావించి వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చానన్నారు. ఓటు వేయని వారు కూడా వచ్చే ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా మనసు మార్చుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు
నాలుగు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో 80 శాతం మేర ఈ ఏడాది అమలు చేస్తున్నామని, మిగిలిన 20 శాతం వచ్చే ఏడాది అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది రైతు భరోసా, అమ్మఒడి తదితర కార్యక్రమలు ప్రారంభిస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు వివక్ష లేకుండా కచ్చితంగా సాయం అందాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. వలంటీర్ల ఎంపిక పూర్తయ్యేదాకా పథకాల అమలు ఆపామన్నారు. వలంటీర్ల నియామకంతో పథకాల అమల్లో వేగం పుంజుకుంటుందన్నారు. వచ్చే ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవారు ఏవరూ ఉండకూడదని, అందరికీ స్థలాలు చూపించాలన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు గత ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచిందని, అది కూడా జగన్ అనే భయంతో పెంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల గుర్తింపు, డెలివరీ బాధ్యత వలంటీర్లదేనని స్పష్టం చేశారు. అన్నీ అనుకూలిస్తే, ఆటో, టాక్సీ డ్రైవర్లకు 10 వేల రూపాయల సాయం సెప్టెంబర్ నుంచి అమలు చేస్తానని తెలిపారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, షాపు నడుపుతున్న టైలర్లు, నారుూ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉందన్నారు. చక్కగా తినగలిగే బియ్యాన్ని సెప్టెంబర్ 1 నుంచి డోర్ డెలివరీ చేస్తామని, ఇది శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామన్నారు. దశలవారీగా వచ్చే ఏప్రిల్ నాటికి రాష్ట్రం అంతటా అమలు చేస్తామన్నారు. గ్రామ సచివాలయంతో వలంటీర్లు అనుసంధానమై పని చేయాలని తెలిపారు. ఈ వ్యవస్థలో అవినీతి ఉండకూడదని భావించి గౌరవ వేతనం కూడా ఇస్తున్నామన్నారు. తప్పు జరగకూడదని, ఏ పొరపాటు జరగకూడదని సూచించారు. సక్రమంగా పని చేస్తే, నాయకులను చేస్తానని ప్రకటించారు. మీరంతా సహజ సిద్ధంగా నాయకులు అవుతారన్నారు. కష్టాల్లో సాయం చేస్తూ, వారి మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారని, ఇవన్నీ చేసే వారే నాయకులన్నారు. పారదర్శకతో, చిరునవ్వుతో సాయం చేస్తూ ఉంటే, వలంటీర్లకు ప్రజలు నమస్కారం చేసే రోజు వస్తుందన్నారు. మంచి మనసుతో పని చేయాలన్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అన్న సందేశం వలంటీర్ల నోటివెంట రావాలన్నారు. ప్రభుత్వ విధానాలపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు 1902 కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎంవో నుంచి దీనిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు. మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి