రాష్ట్రీయం

రెవెన్యూ శాఖలో సంస్కరణలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో ప్రధానమైంది రెవెన్యూ శాఖలో సంస్కరణలు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకువస్తామంటూ కేసీఆర్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నుండి మార్పులు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన పలుమార్లు అన్నారు. ప్రతి ఏటా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి
చేసే ప్రసంగాలు అభివృద్ధి, సంక్షేమం పథకాలు, కార్యక్రమాల చుట్టూ ఉంటూ వస్తున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగాగానీ, మంత్రివర్గ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలుగానీ, ప్రభుత్వం ఇప్పటి వరకే చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను మరోసారి వల్లెవేయడంతోనే ప్రసంగం పూర్తవుతూ వచ్చింది. ఈ కారణంగానే స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ (గోల్కొండ కోట), రాణిమహల్ లాన్స్‌వద్ద జాతీయ పతాకావిష్కరణ తర్వాత ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ చేసే ప్రసంగం చరిత్రాత్మకంగా ఉండాలని, ప్రభుత్వంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టేవిధంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ముందు రెవెన్యూ సంస్కరణలు ప్రధాన అంశంగా ఉంది. అందుకే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. విద్య, వైద్య రంగాలకు సంబంధించి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కేసీఆర్ తన మనోగతం ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిసింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య స్నేహసంబంధాలపై కూడా కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉదని అధికారవర్గాలు తెలిపాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్టస్థ్రాయి కార్యక్రమాలను గోల్కొండ కోట వద్ద నిర్వహిస్తుండటంతో గట్టిపోలీసు భద్రత ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని కేసీఆర్ ఎగురవేస్తారు కనుక ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం రాష్టస్థ్రాయి కార్యక్రమాలు సికింద్రాబాద్‌లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగేవి. గోల్గొండ కోటకు ఉన్న చారిత్రక ప్రాశస్త్యం వల్ల తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ కోట వద్దనే స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. గురువారం జరగబోయే ఉత్సవాల సందర్భగా భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఉత్సవాలకు బుధవారం తుది మెరుగులు దిద్దారు. ఈ పర్యాయం తెలంగాణ పోలీస్‌తోపాటు ఒడిషా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక పోలీసు విభాగం కూడా కవాతులో పాల్గొంటోంది. గోల్కొండ కోట వైపు వెళ్లే వాహనాల రాకపోకలను గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు అవార్డులు, రివార్డుల ప్రధానోత్సవం కూడా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

చిత్రం...గోల్కొండ కోట రాణిమహల్ లాన్స్‌వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు