రాష్ట్రీయం

విద్యుదాఘాతానికి ముగ్గురు చిన్నారులు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో బుధవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్ పఠాన్ (11), షేక్ హసన్‌బూడా (11), పఠాన్ మీర్ (11) విద్యుత్ షాక్ గురై శరీరాలు సగం మేర కాలిపోయి అక్కడికక్కడే కన్ను మూసారు. ఉదయం 5గంటలకు మసీదుకు వెళ్లి నమాజ్ పూర్తిచేసుకుని బొడ్రాయి సెంటర్‌లో ఆడుకునేందుకు వచ్చి వైసీపీ జెండా వద్ద అడుకుంటుండగా జెండా ఇనుప కడ్డీ దిమ్మెలోనున్న స్థానంనుండి పైకి లేచి పైభాగం పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైను తీగపై పడటంతో క్షణాల్లో విద్యార్థులు విగత జీవులయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ అద్దంకి ఇన్‌చార్జి బాచిన చెంచుగరటయ్య, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వైసీపీ యువనాయకులు బాచిన కృష్ణచైతన్య, సర్వశిక్ష అభయాన్ జిల్లాపీడీ వెంకటేశ్వర్లు స్థానిక అధికారులు, నాయకులు కొప్పరంలోని ఘటనా స్థలిని సందర్శించి బాలుర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రు.25 వేల చొప్పున ఆర్థిక సహయం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమాలపు సురేష్ స్థానిక మండల విద్యాశాఖ అధికారి వి కోటేశ్వరరావుకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు.