రాష్ట్రీయం

హితవచనాలు పట్టనే పట్టవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ) : జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులోనే ఉంటే.. మిగిలిన సగం ఆయన చేసే పనుల్లోనే ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరును చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించొద్దంటూ ఒకవైపు విద్యుత్ సంస్థలు, మరోవైపు కేంద్రం పదేపదే చెబుతున్నా జగన్‌కు పట్టడం లేదంటూ ట్విట్టర్ వేదికగా గురువారం వ్యాఖ్యానించారు. విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష మంచిది కాదని, దాని కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు దూరమవుతాయని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి చెప్పినా జగన్ వినడం లేదన్నారు. ఇప్పుడు జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమంటూ కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. రాష్ట్రం దాటి, దేశం దాటి జనమంతా హిత వ్యాక్యాలు చెబుతుంటే కొంచమైనా చెవికెక్కడం లేదన్నారు. బహుశా ఇలా చెప్పించుకోవడం కూడా వాళ్ళకు గర్వకారణంగా ఉందో ఏమో అంటూ వ్యాఖ్యానించారు. పిచ్చికి అనేక రూపాలు ఉంటాయి అంటే ఇదేనేమో మరి అంటూ ముగించారు.