రాష్ట్రీయం

అవినీతిపై పోరాటంలో వెనకడుగు వేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అవినీతిపై సాగిస్తున్న పోరాటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని, వెనుకడుగు వేయద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయ్యారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, శామ్యూల్ హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా గత ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలపై చర్చించారు. అధికారంలో ఉన్న నేపథ్యంలో తనపై కూడా ఒత్తిళ్లు వస్తున్నాయని అయితే ఇలాంటి వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ మొదలు ప్రతి పనిలోనూ విశృంఖలంగా అవినీతి జరిగిందన్నారు. ప్రజా ధనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, వీటిని ఎలా ఉపేక్షిస్తామని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని, అవినీతిపై సాగించే సమరంలో అంతా సహకరించాలని కోరారు.
చిత్రం...మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి