రాష్ట్రీయం

భూముల రీ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వేకు రంగం సిద్ధమైంది. సీఓఆర్‌ఎస్ (కంట్రీ న్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ - కార్స్) ప్రక్రియ ద్వారా సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.1688 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. బుధవారం రెవెన్యూశాఖ సమీక్ష సందర్భంగా రీ సర్వే ప్రణాళికను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్ర విస్తీర్ణం 1.63 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించాల్సి ఉంది. అటవీ భూములు 38వేల 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. జనావాసాలు 2200 చదరపు కిలోమీటర్లు కాగా 17వేల 460 రెవెన్యూ గ్రామాలు, 679 మండలాలకు గాను 49 లక్షల ఎఫ్‌ఎంబీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1. 59 లక్షల సబ్‌డివిజనల్ రికార్డెడ్ ఎఫ్‌ఎంబీలుగా లెక్కలు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.36 కోట్ల మంది భూ యజమానులు ఉన్నారు. రీ సర్వేకు రూ. 1688 కోట్ల అంచనతో అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. 1880-1930 మధ్య కాలంలో తొలిసారి రైత్వారీ గ్రామాలపై రికార్డులు, 1960-80 మధ్య మరోసారి సెటిల్‌మెంట్ గ్రామాల రికార్డులు ఉండేవి. వీటిలో చాలా వరకు రికార్డులు అదృశ్యమయ్యాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అప్‌డేట్ చేశారు. చాలా వరకు సర్వే రాళ్లు కూడా కాలగర్భంలో కలిశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు, రికార్డులకు పొంతనలేదు. సర్వే చేయాలంటూ కోకొల్లలుగా దరఖాస్తులు అందుతున్నాయి. భూ వివాదాలను తగ్గించి రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం పెరగాలంటే రీ సర్వేలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 3,17,44,060 ఎకరాల సర్వే వౌలిక సదుపాయాల కోసం రూ. 346 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫీల్డ్ సర్వే టైటిల్ ఎంక్వయిరీల కోసం రూ. 1342 కోట్లు వెచ్చించాల్సి ఉంది. సీఓఆర్‌ఎస్ నెట్‌వర్క్ వినియోగంతో సర్వే నిర్వహించనున్నారు. ప్రతి చదరపు కిలోమీటర్ సర్వేకు రూ. 1.1లక్షలు ఖర్చవుతుంది. భూముల సమగ్ర సర్వే ఒక విప్లవాత్మక మార్పు కానుంది. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్స్, జీపీఎస్ పరికరాలను ఇందుకోసం వినియోగిస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, గ్రీస్ దశాల్లో కార్స్ ప్రక్రియ వినియోగంలో ఉంది. రోవర్స్ ద్వారా సమాచార సేకరణ జరుపుతారు. ఉపగ్రహ సేవలను కూడా వినియోగించు కుంటారు. దీంతో 30 సెకన్లలో రీడింగ్ తేలుతుంది. రెండు సెంటీమీటర్లు అటు ఇటుగా ఉన్న పరిమాణంలో స్థలాన్ని కూడా కచ్చితంగా సర్వే చేయగల వీలుంటుంది. ఎక్కువ పరికరాలు కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. ఒకేసారి మూడువేల గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. 75 బేస్ స్టేషన్లు, 3440 రోవర్స్ ఫీల్డ్ సర్వే, ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. 1850 ల్యాప్‌టాప్‌లలో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. 700 డెస్క్‌టాప్‌లు, జీఐఎస్ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తారు. సర్వే సిబ్బందికి తగిన శిక్షణ ఇస్తారు. ప్రతి మూడు గ్రామాలకూ ఒక బృందాన్ని నియమిస్తారు. ప్రతి బృందంలో ముగ్గురు సర్వేయర్లను నియమిస్తారు. మండల స్థాయి సర్వేయర్ పర్యవేక్షిస్తారు. తహశీల్దార్ మండల స్థాయి మానిటరింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున సర్వే కోసం కేటాయిస్తారు. మూడు విడతల్లో రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డేటా రైతులతో పాటు అటవీ, గనులు, వ్యవసాయం, నీటిపారుదల, పోలీస్, పట్టణ, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, ఇతర శాఖలకు ఉపయుక్తంగా ఉంటుంది.