రాష్ట్రీయం

గిరిజన సలహా మండలి చైర్‌పర్సన్‌గా కొప్పుల ఈశ్వర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి భారత రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్-టీఏసీ)ని తెలంగాణ ప్రభు త్వం మంగళవారం ఏర్పాటు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హన్ మహేష్ దత్ ఎక్కా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. గిరిజనుల సం క్షేమం కోసం రాజ్యాంగంలోని 244 ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు ఇచ్చింది. ప్రతి రాష్ట్రంలో కూడా టీఏసీ తప్పని సరిగా ఉండాలని కేంద్రం చట్టం చేయడంతో అన్ని రాష్ట్రాలు కూడా నిర్ణీత సమయానికి టీఏసీలను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం మేరకు సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చైర్‌పర్సన్‌గా ముగ్గురు ప్రభుత్వ అధికారులు సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ మెంబర్-సెక్రటరీగా ఉంటారు. వీరితోపాటు ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలలో 15 మందిని సభ్యులుగా నియమించారు.
తెలంగాణ టీఏసీకి నియామకమైన ఎంపీలలో మాలోతు కవిత (మహబూబాబాద్), సోయంబాబు రావు (ఆదిలాబాద్) ఉన్నారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), బాపూరావు రాథోడ్ (బోథ్), అజ్మీరారేఖ (ఖానాపూర్), రామావత్ రవీంద్ర కుమార్ (దేవరకొండ), డీ. రెడ్యానాయక్ (డోర్నకల్), బానోత్ శంకర్ నాయక్ (మహబూబాబాద్), డీ. అనసూయ (ములుగు), రేగకాంతారావు (పినపాక), బానోత్ హరిప్రియ (ఇల్లందు), మేక నాగేశ్వర్‌రావు(అశ్వారావుపేట), పోడెం వీరయ్య (భద్రాచలం), లవుడ్య రాములు (వైరా) ఉన్నారు.
అధికారుల్లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధనా సంస్థ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు.