రాష్ట్రీయం

బీఆర్‌కే భవన్ కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు అధికార యంత్రాంగమం తా మంగళవారం తరలివచ్చింది. వివిధ శాఖల ప్రత్యేక ప్రధా న కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల చాంబ ర్లు బీఆర్‌కే భవన్‌లో సిద్ధం కావడంతో వారంతా ఇక్కడి నుం చే విధులు నిర్వహించారు. అయితే ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పాత సచివాలయం నుంచే విధులు నిర్వహించారు. తాత్కాలిక సచివాలయంలో ఇంకా పూర్తిస్థాయిలో కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు మరి కొన్ని రోజుల పాటు పాత సచివాలయం నుంచే విధులు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడానికి హాల్ ఇంకా సిద్ధం కాలేదు. కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాత్కాలిక సచివాలయానికి అధికారులంతా తరలివస్తేనే పరిపాలన గాడిన పడుతుందని శాఖాధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. మంగళవారం స్వయంగా జోషి బీఆర్‌కే భవన్‌కు వచ్చి తన చాంబర్ నుంచే విధులు నిర్వహించారు. అలాగే సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి అదర్ సిన్హా, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటు చేసిన తమ చాంబర్ల నుంచే విధు లు నిర్వహించారు. అన్ని శాఖలు ఆన్‌లైన్‌లో అనుసంధానం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. అప్పటివరకు వివిధ శాఖల ఉద్యోగులు పాత సచివాలయం నుంచే విధులు నిర్వహించనున్నారు. బీఆర్‌కే భవన్‌కు సచివాలయం పూర్తిగా తరలి రానుండడంతో వాహనాల పార్కింగ్‌ను ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం... బీఆర్‌కే భవన్‌లో సిద్ధమవుతున్న తాత్కాలిక సచివాలయ చాంబర్లు