రాష్ట్రీయం

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజు ప్రమేయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల టికెట్ల కేటాయింపులో సీనియర్ నేత కొప్పు ల రాజుకు ప్రమేయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా చెప్పారు. ఈ విషయ మై పార్టీ నేతలు లేనిపోని అపోహలు పెట్టుకోరాదని ఆయన కోరారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే టికెట్లను కేటాయించారన్నారు. పీసీసీ, ఎల్‌వోపీ ఇన్‌చార్జీ కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆలోచించే టిక్కెట్లు కేటాయించారని ఆయన తెలిపారు. అందులో కొప్పుల రాజుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొంత మందికి టికెట్ల కేటాయింపులో రాజు జోక్యం చేసుకొని, తమకు రాకుండా చేశారని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. నాయకులు ఏమైనా ఫిర్యాదులు ఉంటే పీసీసీ లేదా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో, పార్టీపై ఆరోపణలు చేయొద్దన్నారు. ఏఐసీసీ నేత కొప్పుల రాజు మొదటి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ రాజకీయాలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన అంశాలతోనూ కొప్పుల రాజు పాత్ర ఉండదన్నారు. ఆయన కారణంగానే తా ము గతంలో రాహుల్‌ను కలవలేకపోతున్నామన్న నేతల మాటల్లో నిజం లేదదని కుంతియా స్పష్టం చేశారు. సీనియర్ నేతలు పత్రికలకెక్కి పార్టీ విషయాలను మాట్లాడరాదని, అంతర్గత వేదికలపై తమ భావాలను పంచుకోవాలని కుంతియా కోరారు.

చిత్రం... ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా