రాష్ట్రీయం

వారం రోజులే ఆర్థికాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జిల్లా ప్రజాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులకు (సీఈఓ) నిధులు డ్రా చేయడంతో పాటు, ఖర్చు చేసే అధికారం కల్పించిన వారం రోజులకే ఈ అధికారాలను ప్రభుత్వం మళ్లీ తొలగించింది. నిధులు డ్రా చేసే అధికారాన్ని సీఈఓలకు కట్టబెడుతూ ఈ నెల 6న ఒక జీఓ (జీఓ ఆర్‌టీ నెంబర్ 470) జారీ అయింది. పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్ రాజ్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా ఇటీవలే ఎంపికైన జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీపీ) చైర్‌పర్సన్లు ప్రభుత్వంపై వత్తిడి చేయడంతో ప్రభుత్వం ఈ నెల ఆరోతేదీన జారీ చేసిన ఉత్తర్వులను పక్కకు పెడుతూ మరో జీఓ (ఆర్‌టీ నెంబర్ 478) మంగళవారం జారీ అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పథకాలు, కార్యక్రమాల ద్వారా జడ్పీపీలకు నిధులు ఇస్తుంటాయి. ఈ విధంగా ఇచ్చే నిధులే చాలా తక్కువగా ఉంటాయి. గతంలో జడ్పీపీలకు విస్తృతమైన అధికారాలు, భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసే అవకాశం ఉండేది. ఒక జిల్లా నుండి మంత్రివర్గంలో ఎవరికైనా అవకాశం లభిస్తే, వారికి ఉండే అధికారాలకన్నా, ఆ జిల్లా వరకు జడ్పీపీ చైర్‌పర్సన్లకు విస్తృతమైన అధికారాలు ఉండేవి. అన్ని శాఖల పనితీరుపై రివ్యూ చేసే పూర్తిస్థాయి అధికారాలు ఉండేవి. ఇప్పుడు జడ్పీపీ చైర్సన్లకు నామమాత్రపు అధికారాలే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఆర్థికపరమైన అధికారాలు కూడా సీఈఓలకే అప్పగిస్తే తాము కీలుబొమ్మల్లా ఉండాల్సి వస్తుందని రాష్ట్రంలోని జడ్పీపీ చైర్‌పర్సన్లు మూకుమ్మడిగా ప్రభుత్వం ముందుకు వెళ్లారు. ఆర్థికపరమైన అధికారాలు తమకే ఉండాలని అందరూ కోరడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటూ, సీఈఓలకు అప్పగించిన నిధులపై అధికారాలను తొలగించారు.