రాష్ట్రీయం

అరాచకాలు సృష్టిస్తే.. రాష్ట్రం అగ్నిగుండమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: అరాచకాలు సృష్టిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేయాలంటే కుదరదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తరలింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎందుకీ అహంభావం, ఏమిటీ అరాచకం అంటూ ధ్వజమెత్తారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగినా గెలవలేకపోయామని, సీట్ల సంఖ్య తగ్గడం తదితర అంశాలపై సమీక్ష చేసుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీలపై దాడులు సరికాదని, అలా చేయడం దుర్మార్గమన్నారు. నెల్లూరులో టీడీపీ కార్యకర్తల ఇళ్లు మూడు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు ముగిసి 73 రోజులైనా ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలపై ఈ స్థాయిలో దాడులు కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి అరాచాకాలను అడ్డకోవడంలో పోలీసులు నిస్సహాయంగా మారడం తన జీవితంలో తొలిసారిగా చూస్తున్నానన్నారు. ఇప్పటి వరకూ 469 దాడులు జరిగాయని, ఏడుగురిని హత్య చేశారన్నారు. పల్నాడు ప్రాంతంలో దురాగతాలు మరీ పేట్రేగిపోయాయన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై కేసులు నమోదు చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు గ్రామాలను విడిచిపెట్టి పోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఊళ్లో ఉండవద్దని పోలీసులే చెప్పడం గతంలో ఎన్నడూ లేదన్నారు. ఇంత విధ్వంసకర కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదన్నారు. వైకాపాకు ఓటు వేయకపోతే క్షమాపణలు చెప్పాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని భయభ్రాంతులకు గురి చేస్తే, భయపడతారనే భమ్రలో వైకాపా ఉందని విమర్శించారు. ఇదే పోలీసులు తమ ప్రభుత్వ హయాంలో కూడా పని చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ప్రభుత్వాన్ని, వైకాపాను హెచ్చరించారు. అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాము 151 మంది ఉన్నామని, మీరేం చేయగలరంటూ బెదిరించారని చంద్రబాబు గుర్తుచేశారు. అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో కరవు, శాంతిభద్రతలు, టీడీపీ కార్యకర్తలపై దాడులపై చర్చించేందుకు అంగీకరించి, శాంతిభద్రతలు, టీడీపీ కార్యకర్తలపై దాడుల గురించి మాట్లాడాటానికి అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదన్నారు. టీడీపీకి మైకులు ఇవ్వకుండా అసెంబ్లీని నడిపించారన్నారు. వాకౌట్‌పై మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోతే, బయటకు వెళ్లి మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి కల్పించారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బలంగా పోరాడారని అభినందించారు. కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెబితేనే ఆసుపత్రికి పంపిస్తామని బాధితులతో వైకాపా నేతలు చెప్పడం రాక్షసత్వానికి పరాకాష్ట అంటూ విమర్శించారు. వైకాపాకు ఓటు వేయకపోతే క్షమాపణ చెప్పాలా అని ప్రశ్నించారు. ఓట్లు వేయని వారితో కాళ్లు పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. ఎటు పోతున్నాం.. ఎందుకీ అహంకారం... ఏమిటీ అరాచకం అంటూ ధ్వజమెత్తారు. తాము కూడా గతంలో ఇలా ప్రవర్తిస్తే, మీరు గ్రామాల్లో తిరిగేవారా అని ప్రశ్నించారు. ప్రజావేదికను వ్యక్తిగత కక్షలతో కూలుస్తారా అని విమర్శించారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితిని కాలరాస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు తిరగబడితే వైకాపా నేతలు తోకముడుస్తారని హెచ్చరించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదని, తమను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాష్ట్రం అన్ని విధాల పతనం అవుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరగడానికి వీలు లేదని పోలీసులను కోరుతున్నామన్నారు. వైకాపా నేతలు బెదిరిస్తారని, వేధింపులకు పాల్పడతారని, దౌర్జన్యాలకు దిగుతున్నారని, అయినా పోలీసులు మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టామని, 8 వేల ఎకరాలు రిజర్వులో ఉంచి వౌలిక వసతుల అభివృద్ధి ప్రారంభించామన్నారు. అమరావతి పనులు నిలిపివేశారని, విజయవాడ నుంచి ఉన్న అంతర్జాతీయ విమాన సర్వీసును నిలిపివేశారన్నారు. విజయవాడ నుంచి 60 విమాన సర్వీసులు ఉండగా, రెండు నెలల్లో 20 పోగోట్టారన్నారు. కనెక్టివిటీ లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ భూభాగం నుంచి శ్రీశైలానికి గోదావరి జలాలు తీసుకెళ్తాననడం అన్యాయమన్నారు. కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల తరలింపు ఇద్దరు సీఎంలకు సంబంధించినది కాదన్నారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని హితవుపలికారు.

చిత్రం... టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు