రాష్ట్రీయం

స్పీకర్ సమీక్షలు చేయకూడదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 12: శాసన సభాపతిగా సమీక్షలు ఏలా చేస్తారంటూ కొంతమంది అజ్ఞానులకు సమాధానంగా తొలుత తాను ఆమదాలవలస నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యేనన్న విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం వారికి గుర్తుచేసారు. సోమవారం పొందూరు మండలంలో జరిగిన వలంటీర్ల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కారుకూతలు కూసే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌గా తనకు ఉందని, శాసనసభాపతిగా తనకు విశేష అధికారాలు ఉంటాయన్న విషయాన్ని మరిచిపోవద్దంటూ విమర్శకులను హెచ్చరించారు. వలంటీర్ల ఎంపికపై టీడీపీకి చెందిన ఎవరైనా పిటిషన్ వేస్తే భయపడనవసరం లేదని, ఆమదాలవలస ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటానన్నారు. పేస్కేల్ వరకూ ఉద్యోగ భద్రత కలిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ముందు ఎమ్మెల్యేగా శాసనసభకు ఆమదాలవలస నియోజకవర్గం ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టి శాసనసభకు పంపిన తర్వాతే తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టానని, ముందుగా తనను గెలిపించిన ప్రజల సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారంటూ తమ్మినేని విమర్శకులను ప్రశ్నించారు. ఆగస్టు 18 తర్వాత గ్రామాల్లో శాసనసభ్యులు పర్యటిస్తారని, గ్రామ వలంటీర్ల వ్యవస్థ పనితీరును పర్యవేక్షిస్తారని వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం శాసనసభలో చట్టాలను తీసుకువచ్చామన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లకు చట్టం చేయడంతో వచ్చే శాసనసభలో 50 శాతం మహిళలతో నిండిపోతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో గొప్ప విషయమని చెప్పారు. 4.50 లక్షల వలంటీర్లను, 1.50 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చే విధానంతోనే నడుస్తుందన్నారు. శ్రీలంక, మలేషియా దేశాల నుంచి కూడా గ్రామ సచివాలయాల పరిశీలనకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలకు సీఎం శ్రీకారం చుట్టారన్నారు.