రాష్ట్రీయం

ఆర్టికల్ 370ని వ్యతిరేకించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 12: జమ్ము, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని, దీనిని వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు సోమవారం వెలుగుచూశాయి. ప్రజల హక్కులను హరించే విధంగా పాలకుల విధానాలు ఉన్నాయని, దీనిని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని మావోలు పిలుపునిచ్చారు. 370, 35ఎ ఆర్టికల్స్‌ను రద్దుచేసి కాశ్మీర్ ప్రజల హక్కులకు భంగం కలిగించారని, ఇదే పరిస్థితి అన్నిచోట్ల కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా సరిహద్దుల్లో వరుస సంఘటనలతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు మాత్రం వారి విధానాలను ప్రచారం చేసేందుకు పోస్టర్లు, బ్యానర్లు వేస్తూనే ఉన్నారు.