రాష్ట్రీయం

‘గిఫ్ట్ ఏ స్మైల్’కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఇచ్చిన పిలుపు ‘గిఫ్ట్ ఏ స్మైల్
చాలెంజ్’కు రాజ్యసభ జోగినపల్లి సంతోష్‌కుమార్ స్పందించారు. కీసర రిజర్వ్ ఫారెస్ట్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకోనున్నట్టు సంతోష్‌కుమార్ ప్రకటించారు. తన జన్మదినం సందర్భంగా హం గూ, ఆర్భాటాలు, అనవసర ఖర్చులు చేయకుండా సమాజహితం కోసం సహాయం చేయాల్సిందిగా కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం
తెలిసిందే. హైదరాబాద్ శివారులో కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తన ఎంపీ నిధులతో ఎకో టూరిజమ్‌గా అభివృద్ధి చేయనున్నట్టు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు ప్రణాళికను రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకునేందుకు ఎకో టూరిజమ్ దోహదం చేస్తుందన్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సేద తీర్చుకోవడానికి కీసర ఎకో టూరిజమ్ పార్క్ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది హైదరాబాద్ నగరవాసులకు బహుమతిగా ఇవ్వనున్నట్టు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. యాదాద్రి, కీసరగుట్టకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎకో టూరిజమ్ పార్క్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.