రాష్ట్రీయం

మహిళా సాధికారతకు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించే బిల్లులు ప్రవేశపెట్టి తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు నాంది పలికిందని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభలో బిల్లులపై చర్చ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బెల్ట్‌షాపుల్లో మద్యం ఏరులై పారిందని, దీనివల్ల అనేక మంది మహిళల జీవితాలు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నా వడ్డీని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలుచేస్తే తెలుగుదేశం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు వంచించారని ధ్వజమెత్తారు. 2016 నుంచి 2019 వరకు రూ. 3వేల కోట్ల మేర సున్నా వడ్డీ నిధులు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46వేల బెల్ట్‌షాపులకు మాత్రం అనుమతిచ్చారని ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకుంటున్న వనజాక్షి లాంటి మహిళా అధికారులను వేధింపులకు గురిచేసి మాఫియాను కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పాదయాత్రలో మహిళల కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ వారికి ఆర్థిక, రాజకీయ చేయూత నందించే లక్ష్యంతో ఉన్నారన్నారు.
5 బిల్లులకు ఆమోదం
శాసనసభలో మంగళవారం 5 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేషన్ పద్ధతిలో చేపట్టే పనుల్లో 50 శాతం ప్రాధాన్యత కల్పించటంతో పాటు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కాంట్రాక్ట్, సర్వీస్ పనుల్లో 50 శాతం ప్రాధాన్యత, బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు సుదీర్ఘ చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మంత్రులు శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టారు. బీసీ కమిషన్ బిల్లు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వ విప్ కురుముట్ల శ్రీనివాసులు, మహమ్మద్ ముస్త్ఫా, జోగి రమేష్, జంగా కృష్ణమూర్తి తదితరులు బలపరిచారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే మరో రెండు బిల్లులను ఉప ముఖ్య మంత్రి పుష్ప శ్రీవాణి, ఆర్‌కే రోజా, విడదల రజని బలపరిచారు. చర్చ అనంతరం బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ స్థానాన్ని అలంకరించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం పట్ల స్పీకర్ విజ్ఞాపన మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు సభ్యులు లేచి నిలబడి హర్షామోదాలు తెలిపారు.

చిత్రం...సభలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి