రాష్ట్రీయం

హంపీలో శ్రీవ్యాసరాయల బృందావనం పునర్నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 19: హంపీ సమీపంలోని అనెగొందిలో దుండగుల చేతిలో ధ్వంసమైన శ్రీవ్యాసరాయుల బృందావనాన్ని శుక్రవారం పునర్నిర్మించారు. మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం పనులు పూర్తిచేసి ప్రతిష్టాపన గావించారు. కర్నాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి తాలూక హంపీ క్షేత్రం సమీపంలోని అనెగొంది క్షేత్రంలో తుంగభద్ర నది ద్వీపంలో వెలసిన నవబృందావనం గడ్డపై తొమ్మిది బృందావనాలలో ఒకటిగా ఉన్న శ్రీవ్యాసరాయల బృందావనాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. విషయం తెలియగానే మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బృందావనం శిధిలాలను చూసి మనస్థాపానికి గురయ్యారు.
మధ్వమత పీఠాధీశులు శ్రీవ్యాసరాయ మఠం పీఠాధిపతి శ్రీవిద్యామనోహర తీర్థులు, శ్రీవిద్యా విజయతీర్థులు, శ్రీవిద్యాశ్రీశతీర్థులు, ఉత్తరాధి మఠం పీఠాధిపతి శ్రీసత్యాత్మకతీర్థులు, పేజావరమఠం పీఠాధిపతి శ్రీవిశే్వశతీర్థులతో కలిసి బృందావనం పునర్నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తిచేశారు. శ్రీవ్యాసరాయల బృందావనానికి శుక్రవారం సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సంప్రోక్షం గావించారు. బృందావనానికి వెండి కవచాలు, ప్రత్యేక పూలతో అలంకరించి పునఃప్రతిష్టాపన చేశారు. అనంతరం భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవ్యాసరాయల బృందావనాన్ని దర్శించుకున్నారు.