రాష్ట్రీయం

పులివెందుల రాజకీయం ఇక్కడ చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): పులివెందుల రాజకీయలను ఇక్కడ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పులివెందులలో చేసినట్టుగా అసెంబ్లీలో బెదిరిపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అక్కడ చేసినట్లు అమరావతిలో చేస్తే కుదరదన్నారు. భయపెడితే భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు. తప్పును వేలెత్తి చూపిస్తే భయపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పీపీఏల విషయంలో మాట్లాడుతూ పవన విద్యుత్ ధరలు తగ్గించాలని 2018లోనే తాను పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 82 కంపెనీలను పార్టీలుగా చేస్తూ పిటిషన్ వేశామన్నారు. తాము పిటిషన్ వేసిన తరువాత 82 కంపెనీలు కోర్టుకు వెళ్లాయన్నారు. పవన విద్యుత్ ధరలను తగ్గించేందుకు తాము ఎంతో ప్రయత్నిస్తే, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తప్పదారి పట్టించి, ఏదేదో మాట్లాడుతోందన్నారు. పీపీఏల అంశంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. అన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్దేశకాలకు అనుగుణంగానే జరిగాయన్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీసారీ ఎదో జరిగిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలకు పాల్పడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. పులివెందులలో ఈ తరహా పంచాయితీలు కుదురుతాయేమో గానీ అమరావతిలోనూ, వేరే ప్రాంతాల్లో అస్సలు కుదరవన్నారు. అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా జగన్‌ను చూసి భయపడి ఏమీ చేయలేని, ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. తన సహజ సిద్ద వ్యవహార శైలిని సీఎం జగన్ మార్చుకోవాలని హితవు పలికారు. రాజధాని పరిధిలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి ఉన్నాయన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగానూ, రాజధాని ప్రాంతంలోనూ రియల్ ఎస్టేట్ రంగం ఎంతో పుంజుకుందన్నారు. గణీయమైన అభివృద్ది సాధించిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఈ అసమర్థ ప్రభుత్వ తీరుతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం అంతా పడిపోయిందన్నారు. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఈ అంశం పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రాజధాని పరిధిలో వ్యవస్థ అంతా కుదేలవుతోందన్నారు. కూలీలకు కనీసం పని కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. ప్రజావేదిక ప్రభుత్వ స్థలం అన్న చంద్రబాబు అవసరమైతే క్రమబద్ధీకరణ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.