రాష్ట్రీయం

మంత్రులు లేక.. సభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా సభలో మంత్రులెవరూ లేకపోవటంతో ప్రశ్నోత్తరాలతో సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన శాసనసభ గురువారం 15 నిమిషాల పాటు వాయిదా పడింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆక్షేపిస్తూ ఇలా జరగటం చరిత్రలో ఇదే ప్రథమం అన్నారు. అయితే ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంత్రులు సకాలంలో హాజరుకాకపోవటానికి కారణం చెబుతూ అత్యవసర మంత్రివర్గ సమావేశం.. అందునా ముఖ్యమైన బిల్లులపై సుదీర్ఘ చర్చ కారణంగా తామంతా రాలేకపోయామని, దయచేసి మన్నించాలని కోరారు. చివరగా స్పీకర్ స్పందించి ఇలాంటి సంఘటన పునరావృతం కారాదంటూ రూలింగ్ ఇచ్చారు. గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని సీతారామ్ యథాప్రకారం తొమ్మిది గంటల కల్లా తన సీట్లోకి వచ్చారు. అయితే మంత్రులెవరూ కన్పించకపోవడంతో ఆశ్చర్యంగా ఎవరూ లేరు ఏమిటని ప్రశ్నించగా చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి బదులిస్తూ మంత్రివర్గ సమావేశం జరుగుతున్నదంటూ జవాబు ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా ఏటూ జీరో అవర్ జరగటం లేదుకదా.. ఈలోగా జీరో అవర్ ప్రారంభించాలన్నారు. సభలో కోరం లేదంటూ ఓ సభ్యుడు బదులివ్వగా అయితే సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించగా ప్రతిపక్ష సభ్యులు షేమ్ షేమ్ అంటూ బల్లలు చరిచారు. ఈలోపుగా ముఖ్యమంత్రి, మంత్రులు వారి వెంట ఇతర సభ్యులు సభలోకి ప్రవేశించగా స్పీకర్ సరిగ్గా 9.18 నిమిషాలకు సభను ప్రారంభించారు. వెంటనే చంద్రబాబు లేచి ఈ విధంగా సభ వాయిదా పడటం అనేది చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. ఒక్కోసారి కోరం లేక వాయిదా పడవచ్చు. మంత్రులు సకాలంలో రాకపోవటం ఏమిటని ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశం అనేది ముఖ్యమే, కాదనటం లేదు... అయితే ఇది సమయమా అని ప్రశ్నించారు. జరిగిందేదో జరిగింది ఇక మున్ముందు ఇలా జరగకుండా చూడాలన్నారు. దీనికి స్పీకర్ కూడా మద్దతు పలుకుతూ సకాలంలో సభ ప్రారంభమయ్యేలా చూడాలని ఇక భవిష్యత్‌లో వాయిదా పడరాదంటూ రూలింగ్ ఇచ్చారు.