రాష్ట్రీయం

‘జ్వాలామాలిని’గా భద్రకాళి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గం టలకు నిత్యహ్నికం పూర్తిచేసిన అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులలో ఇచ్ఛాశక్తిని ముద్రక్రమంలోనూ జ్ఞానశక్తిని జ్వాలామాలినిగా అలంకరించి పూజారాధనలు చేశారు. దశమహా విద్యలలో ఆద్య విద్య అయిన కాళీ నవర్య క్రమంలో చతుర్దశి ఆదిదేవత శంకరుడు. అమ్మవారు తాను అద్దంలో చూసుకుంటే తన ముఖం కాకుండా శంకరుడి ముఖం కనిపిస్తుందని వైదికాగమ శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే గౌరీ శంకరుల దాంపత్యంలా ఉండాలని అంటారు. భార్యాభర్తల అన్యోన్యతకు గౌరీ శంకరులే ప్రతీక. కాళిక్రమాన్ని అనుసరించి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారం రోజున అమ్మవారిని దర్శించిన దంపతులు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు అన్యోన్యతతో సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తారు. కితికి దశ మహా దిశలలోని కాళిక్రమాన్ని అనుసరించి ఆదిదేవత ముద్ర అంటే సంతోషాన్ని కలిగిస్తుందని అర్దం. ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌దంపతులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. .