తెలంగాణ

భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 13: ఖమ్మం జిల్లా శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ముందుగా ప్రాకారమంటపంలో అగ్నిని మథించి యాగశాలలోని అగ్నిగుండంలో ప్రవేశపెట్టారు. తర్వాత గరుత్మంతుడిని మేల్కొలిపి గరుడ కుంభాన్ని శిరస్సుపై ధరించి వేదపండితులు దేవాలయం చుట్టూ తిరుగుతూ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు.
అక్కడ ముందుగా స్వామికి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, బ్రహ్మఘోష చేశారు. ఉత్సవమూర్తుల పూజల అనంతరం గరుత్మంతుడికి గరుడప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టారు. ఆ ప్రసాదానే్న సంతానం లేని స్ర్తిలకు గరుడముద్దలుగా పంపిణీ చేశారు. అనంతరం గరుడచిత్రపటాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య ధ్వజస్తంభం పైకి అధిరోహించారు. ధ్వజారోహణంలో ఉన్న గరుత్మంతుడు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు క్షేత్రానికి రక్షకుడిగా ఉండాలని స్వామి ఆదేశించారు. గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన 108 మంది స్ర్తిలు ముందుగా గర్భగుడిలో మూలవరులను దర్శించుకుని, గర్భాలయం వెనుకభాగానికి వెళ్లి ప్రసాదంగా తీసుకున్నారు. భేరీ పూజ నిర్వహించి 33 మంది దేవతలను ఆహ్వానించి ప్రతిష్ఠించారు. బలిహరణం, బలిగజ్జెలు జరిపారు. 16 రకాల వాయిద్యాలతో భేరీపూజ జరిగింది. ఈ సందర్భంగా 21 మంది వాయిద్యకారులకు దేవస్థానం స్వామి శేషవస్త్రాలతో సత్కరించింది. తర్వాత స్వామి హనుమంతుని వాహనంపై తిరువీధి సేవకు వెళ్లారు. దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి తదితరులు వేడుకలో పాల్గొన్నారు.