తెలంగాణ

జెపి దర్గాను అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: భక్తులకు వసతితో పాటు, సంపూర్ణ వౌళిక సదుపాయాలు కల్పించి జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇన్ముల్ నర్వ దగ్గర ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సిఎం సమీక్షించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పి.లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సీనియర్ అధికారులు ఎకె ఖాన్, ఉమర్ జలీల్, ఫడీఫుల్లా, వక్ఫ్ బోర్డు సిఇఓ అసదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తాను అనేక సార్లు ఈ దర్గాను సందర్శించానని, కేవలం ముస్లింలే కాకుండా అన్ని మతాల వారు అక్కడికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ దర్గాను అన్ని విధాల అభివృద్ధి చేసి సమీపంలోని ప్రభుత్వ భూమిని భక్తుల వసతి కోసం వినియోగించాలని కోరారు. దర్గా వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలో తెలియజేయాలని ఎసిబి డిజి ఎకె ఖాన్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అజ్మీర్ దర్గాకు ఛాదర్‌ను పంపించిన సిఎం
రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పించే ఛాదర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి సాగనంపారు. ఛాదర్‌తో పాటు ప్రత్యేక నగదు, నజరానా కూడా అధికారుల ద్వారా పంపారు. అంతకు ముందు ముస్లిం మత పెద్దలు ఛాదర్‌కు ప్రత్యేక ప్రార్థన చేశారు. గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న అజ్మీర్ దర్గా ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. తెలంగాణ మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, వక్ఫ్‌బోర్డు సిఇఓ అసదుల్లా అజ్మీర్‌లు అజ్మీర్ దర్గాకు ఛాదర్‌ను అందించేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎసిబి డిజి ఎకె ఖాన్, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరక్టర్ షఫీపుల్లా తదితరులు పాల్గొన్నారు.