రాష్ట్రీయం

జగన్ మంత్రివర్గంలో 23మంది కోటీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సీఎంతో ఉన్న 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సర్వే ప్రకటించింది. మొత్తం మంత్రివర్గంలో 88 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని పేర్కొంది. ఇందులో 17 మందిపైన వివిధ రకాలైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 65 శాతం మందికి నేరచరిత్ర ఉందని పేర్కొంది. ఇందులో 9 మందిపైన తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. మంత్రివర్గంలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు. 26 మంది మంత్రుల సగటు ఆస్తులు విలువ రూ. 35.25 కోట్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆస్తులు రూ. 510.38 కోట్లు కలిగి ఉన్నారు. రెండవ స్థానంలో మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి రూ.130 కోట్లు, మూడవ స్థానంలో మేకపాటి గౌతమ్ రెడ్డికి రూ.61 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ సంస్థ పేర్కొంది. రుణభారానికి వస్తే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రూ. 20 కోట్లు, చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ. 12 కోట్లు, ముత్తం శెట్టి శ్రీనివాసరావుకు రూ.5 కోట్లు అప్పులు ఉన్నాయి. ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిని విశే్లషిస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రూ.38 కోట్లు, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు రూ. 3 కోట్లు, డాక్టర్ సురేష్ ఆదిమూలపుకు రూ. 1 కోటి ఆదాయం ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఎనిమిది మంది మంత్రుల విద్య 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 18 మంది మంత్రులు డిగ్రీ ఆ పైన కోర్సులను చదివి నట్లు పేర్కొన్నారు.