రాష్ట్రీయం

ఇద్దరు సీఎంల భేటీకి అజెండా ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న ప్రగతిభవన్‌లో భేటీకి అజెండా ఖరారు అయింది. నీటిపారుదల రంగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, కోర్టులు, ట్రిబ్యునల్ కేసులను వెలుపల పరిష్కరించుకునే అంశంపై చర్చించనున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపిణీ, ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపుల అంశం గతంలో వివాదమైంది. తెలంగాణ ప్రభుత్వం తమకు విద్యుత్‌కు సంబంధించి సుమారు 3 వేల కోట్లు బాకీ పడినట్టు గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమకు బాకీ పడినట్టు ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రత్యారోపణ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం కూడా ఇద్దరు సీఎంల భేటీ సందర్భంగా చర్చకు రానున్నాయి. విద్యుత్ సంస్థల్లో 11 వందల మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే వీరిని చేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వీరికి ఇరు రాష్ట్రాలు చెరిసగం వేతనాన్ని భరించేలా కోర్టు ఆదేశించింది. ఈ అంశం గతంలో ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో సమావేశమై చర్చించినా పరిష్కారం కాలేదు. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ సందర్భంగా చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ప్రాథమిక దశలో ఇరువురు సీఎంల సమావేశం తర్వాత జూలై 3న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్‌లో భేటీ కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇరువురు సీఎస్‌లు గవర్నర్ సమక్షంలో సమావేశమై పరిష్కారం కోసం తీసుకోనున్న చర్యలకు ఆమోదం పొందనున్నట్టు సమాచారం.