రాష్ట్రీయం

ప్రజావేదిక ఇక నేలమట్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేసే ప్రక్రియను సీఆర్‌డీఏ అధికారులు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. జేసీబీలను, కూలీలను ప్రజావేదిక ప్రాంగణంలోకి తరలించారు. ఈ కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను 8.9 కోట్ల రూపాయలతో నిర్మించడం తెలిసిందే. ఇక్కడ పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ఆయన నిర్వహించేవారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఈ భవనాన్ని తనకు కేటాయించాలని ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ సైతం రాశారు. అయితే సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ఈ ప్రజావేదికను కూల్చి వేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడం తెలిసిందే. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ల సదస్సు ముగియడంతో కూల్చివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సీఆర్‌డీఏ అధికారులు, ఇంజనీర్లు అక్కడకు చేరుకుని కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజావేదికలోని ఏసీలు, ఫర్నిచర్, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామగ్రిని లారీల్లో బయటకు తరలిస్తున్నారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోకి తరలించనున్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసానికి రానున్న నేపథ్యంలో ముందు జాగ్రత చర్యగా ప్రజావేదిక పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.