రాష్ట్రీయం

బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఉండవల్లి ప్రజావేదికలో రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో భాగంగా మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు వద్దన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరపడంలో అర్థం లేదన్నారు. ఆ మైనింగ్ జరపకపోతే, రాష్ట్రానికి వచ్చిన నష్టం లేదన్నారు. మనకు శాంతి, భద్రత ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. గిరిజన యువత మావోయిస్టులుగా మారకుండా గిరిజన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వారి జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని సూచించారు. గిరిజనులను విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కాలుష్యంపై విధాన రూపకల్పనకు నిపుణులతో ఒక కమిటీని వేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలని సూచించారు. జవాబుదారీ తనం ఉండేలా చూడాలన్నారు. కాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టి సారించాలన్నారు. కాలుష్య కారకాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కమిటీలో మంచి నిపుణులను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే, వాటిని బుల్‌డోజ్ చేయవద్దని అధికారులను ఆదేశించారు. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా, దానిపై సానుకూలంగా పరిశీలించాలన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మంచినీరు పూర్తిగా కలుషితం అయిందన్నారు. పాదయాత్రలో తాను ప్రజల కష్టాలను చూశానన్నారు. మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ధవళేశ్వరం నుంచి పైపులైను ద్వారా నీటిని తీసుకుని ప్రతి గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి, అక్కడ నీరు నిల్వ ఉంచేలా చూడాలన్నారు. దీనిపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.