రాష్ట్రీయం

సచివాలయ నిర్మాణానికి మంత్రివర్గ ఉప సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సం ఘంలో సభ్యులుగా ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం ప్రభుత్వానికి సిఫారసులు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయంలోని కొన్ని భవనాలను అలాగే ఉంచి, కొన్నింటినీ మాత్రమే కూల్చి వేయడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తుది నిర్ణయం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పాత సచివాలయంలోని భవనాలను మొత్తంగా కూల్చి వేయాలా? లేక కొన్నింటిని అలాగే కొనసాగించాలా? అనే అంశాలను మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేయనుంది. అలాగే కొత్త సచివాలయ నిర్మాణానికి ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజు కాంట్రాక్టర్, చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ వేర్వేరుగా నమూనాలను ప్రభుత్వానికి సమర్పించారు. వీటి నమూనాలను కూడా మంత్రివర్గ ఉప సంఘం పరిశీలించి ఒక నమూనాలను ఎంపిక చేయనుంది. అయితే మంత్రివర్గ ఉప సంఘం చేసే సిఫారసుతో ప్రమేయం లేకుండా తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎం కేసీఆర్‌కు కట్టబెడుతూ మంత్రిమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే.