రాష్ట్రీయం

బోరు బావిలో ఒకరు మృతి.. మరొకరు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడవలూరు: నెల్లూరు జిల్లా విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి వెనుకభాగాన ఉన్న ఫిల్టర్ పాయింట్ కోసం తవ్విన గుంతలో పడి కూరుకుపోయిన సంఘటన వెలుగుచూసింది. స్థానికులు గమనించి సమాచారం తల్లిదండ్రులకు చేరవేశారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గుంతలో పరిశీలించగా బాలుడిని చేతుల కదలిక ఉండటంతో స్థానిక మత్స్యకారులు బాలలను తీసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే ప్రసన్న హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. జేసీబీని రప్పించి బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వించి పిల్లలను రక్షించే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల శ్రమించి చిన్నారులను క్షేమంగా ప్రాణాలతో బయటకు తీయగలిగారు. ఎల్లంగారి ఈశ్వరయ్య, సుప్రియ దంపతుల మూడేళ్ల కుమార్తె మోక్ష అనే బాలికను 108లో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు పంపించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందింది. పామంజి తాతయ్య, పోలమ్మ దంపతుల మూడేళ్ల కుమారుడు గోపిరాజు క్షేమంగా ఉన్నాడు. ప్రాణాలతో బయటపడిన పిల్లలను పరామర్శించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున ఎమ్మెల్యే ఆర్థిక సహాయం ప్రకటించారు. సంఘటనా స్థలంలో మండల తహశీల్దార్ పీవీ మల్లికార్జునరావు, కోవూరు సీఐ శ్రీనివాసరావు, ఫైర్ డీఎస్పీ ధర్మారావు, ఎస్‌ఎఫ్‌ఓ శ్రీనివాసరావు, స్థానిక ఎస్‌ఐ నాగబాబు, మాజీ ఎఎంసీ చైర్మన్ అచ్చుతరెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక మత్స్యకార పెద్దలు, వందలాది మంది సంఘటనా స్థలంలో పిల్లల్ని రక్షించే పనులను పర్యవేక్షించారు. ఇదిలావుండగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం గ్రామస్తులు ఫిల్టర్ పాయింట్‌ను వేసి మోటారు సహాయంతో నీరు అందించడానికి సిద్ధం చేశారు. ఫిల్టర్ పాయింట్ పైపుల పైభాగాన గుంత ఉన్నందున, చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఆ గుంతలో పడి లోపల కూరుకుపోయిన సంఘటన జరిగింది. గాడిని పూడ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానించారు.

చిత్రం...రక్షించిన బాలుడితో ఎమ్మెల్యే ప్రసన్న