ఆంధ్రప్రదేశ్‌

నొప్పి లేకుండా పన్నుపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలో ప్రజలకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, వేధింపులు లేకుండా పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆదాయ సముపార్జిత శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పన్నులు వసూళ్లు, లక్ష్యాల సాధనలో రాష్ట్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోవాలని, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చేలోపే మేలైన పద్ధతులను అమలు చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాపలని సిఎం అధికారులను కోరారు. రాష్ట్రంలో వర్తక, వ్యాపారాలు చేస్తున్న 700 కంపెనీలు, లక్షా 60 వేల మంది ట్రేడర్లకు ఎటువంటి వేధింపులు లేకుండా, ఏ స్థాయిలోనూ ఆదాయాన్ని కోల్పోకుండా ఆధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఈ-వే బిల్స్, టాక్స్ అనలిటిక్స్, చెక్‌పోస్ట్‌ల ఆధునీకరణ, యాప్స్ వినియోగం విస్తృతంగా చేయడం వంటి సాంకేతిక పద్ధతులతో అవినీతికి చోటివ్వని పన్నుల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అమ్మకందారులు ఇన్‌వాయిస్ అప్‌లోడ్ చేయకపోతే ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి, అప్పటికీ పద్ధతి మార్చుకోపోతే పెనాల్సీ విధించాలని అన్నారు. చెక్‌పోస్ట్‌ల దగ్గర ఏ వాహనం కూడా రికార్డు అవ్వకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని అన్నారు. బోగస్ ఇన్వాయిస్, బోగస్ ట్రాన్జాక్షన్స్‌ను నియంత్రించే విధానాలను అమలు చేయాలని సిఎం కోరారు. చెక్‌పోస్ట్‌ల ఆధునీకరణ బాధ్యతను ఎపిఆర్‌డిసికి ఆప్పగించాలని అందువలన చెక్‌పోస్ట్‌ల ఆదాయం 8.72 కోట్ల రూపాయల నుంచి 46 కోట్లకు పెరిగిందని అన్నారు. 2015-16లో రాష్ట్రంలో పన్నుల వసూళ్ళ లక్ష్యం 44,423 కోట్లు కాగా, 39,854 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అన్నారు. 2016-17లో 52,618 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు సిఎం తెలియచేశారు.