ఆంధ్రప్రదేశ్‌

కోస్తాలో ఎడాపెడా బోర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 12: గత ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఈసారి మండుతున్న ఎండలతో కోస్తా జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కృష్టా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే మూడు మీటర్ల దిగువకు భూగర్భజలాలు వెళ్లాయి. రాష్ట్రంలో భూగర్భజలాల తీరును పరిశీలించేందుకు భూగర్భ జలవనరుల శాఖ వివిధ ప్రాంతాల్లో పీజోమీటర్లు ఏర్పాటు చేసింది. కోస్తా జిల్లాల్లో దాదాపు 1240 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని గమనిస్తున్నారు. నగరీకరణ, పరిశ్రమల ఏర్పాటు కారణంగా భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా ఉంటోంది. భూగర్భజలాల వినియోగంపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఎడాపెడా తోడేస్తున్నారు. ఫలితంగా రోజురోజుకు భూగర్భ జలాలు పాతాళానికి వెళ్తున్నాయి. నింగినుంచి రాలిన ప్రతి చినుకు భూమిలో ఇంకేలా చేపట్టిన చర్యలు అంతంత మాత్రమే కావడంతో దీని ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. కోస్తా జిల్లాల్లో పశ్చిమ గోదావరిలో దాదాపు 20 మీటర్ల లోతు, ప్రకాశం జిల్లాలో 19 మీటర్ల లోతుకు భూగర్భజలాలు వెళ్లాయి. సగటున కోస్తా జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో 9.71 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 11.1 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. భూగర్భజలాల వెలికితీతపై వాల్టా చట్టం ఏర్పాటుచేసినా పటిష్టంగా అమలుచేయకపోవడంతో ఎడాపెడా బోర్లు వేస్తున్నారు. నీటి సరఫరాకు అంతరాయం ఉండకూడదని భావిస్తూ 300 అడుగుల వరకూ బోర్లు వేస్తున్నారు. ఈ పరిణామం భూగర్భజలాలపై తీవ్రప్రభావం చూపుతోంది. మరికొన్ని చోట్ల సముద్రజలాలు చొచ్చుకువచ్చే ప్రమాదం పొంచి ఉంది. గత ఏడాదితో పోలిస్తే తాజాగా వివిధ జిల్లాల్లో భూగర్భ జలాల పరిస్థితి ( భూ ఉపరితలం నుంచి...మీటర్ల లోతులో) ఇలా ఉంది.

జిల్లా ఏప్రిల్ 2014 ఏప్రిల్ 2016 వ్యత్యాసం
శ్రీకాకుళం 6.63 8.23 -1.60
విజయనగరం 6.22 7.17 -0.95
విశాఖపట్నం 7.36 8.62 -1.26
తూర్పు గోదావరి 10.19 10.34 -.0.15
పశ్చిమ గోదావరి 15.92 19.31 -3.39
కృష్ణా 8.14 10.74 -2.6
గుంటూరు 8.59 12.12 -3.53
ప్రకాశం 16.42 18.33 -1.91
నెల్లూరు 7.96 5.00 2.96

ప్లీనరీ నిర్వహణకు
కమిటీల నియామకం

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో జరగనుండగా అందుకు ఏర్పాట్లను ఆ పార్టీ ముమ్మరం చేసింది. వేసవి దృష్ట్యా ప్లీనరీని హైదరాబాద్‌లో పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం పార్టీ నేతలు ఏర్పాట్ల కమిటీలను ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్ల గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధ్యక్షుడిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్, సభ్యులుగా మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, ఖమ్మం జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, ఖమ్మం డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డిసిఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, యూనిస్ సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, ఖమ్మం మేయర్ పాపాలాల్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తాళ్ళూరి వెంకటేశ్వరరావులును నియమించారు. వసతుల కమిటీకి ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, భోజనాలకు మువ్వా విజయ్‌బాబు, వేదికకు తాటి వెంకటేశ్వర్లు, వలంటీర్లకు నల్లమల వెంకటేశ్వర్లు, ప్రచార కమిటీకి నాగచంద్రారెడ్డి, మీడియా కమిటీకి ఆర్‌జెసి కృష్ణ, మహిళా ప్రతినిధుల వసతి కమిటీకి గడిపల్లి కవిత, అలంకర కమిటీకి పాపాలాల్‌ను కన్వీనర్లుగా నియమించారు.