ఆంధ్రప్రదేశ్‌

భద్రతా వలయంలో సిఎం నివాస భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస గృహం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రి ఇంటి మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించేవారు. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. అంతేకాకుండా భద్రతను మరింత పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి కరకట్టను ఆనుకుని ఉన్న లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన అతిథి గృహంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్న ఈ ఇంటికి తూర్పు, పడమర భాగంలో పంట పొలాలు ఉన్నాయి. పశ్చిమ వైపు కొద్ది దూరంలో ఒక ఎన్‌ఆర్‌ఐకి చెందిన ఫాం హౌస్, ఆ తరువాత మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి చికిత్సా కేంద్రం మాత్రమే ఉన్నాయి. ఈ కరట్టమీద ఈ మూడు తప్ప వేరేమీ ఉండవు. ముఖ్యమంత్రి నివాస గృహానికి ఉత్తరాన కృష్ణా నదీ పరీవాహక ప్రదేశం ఉంటుంది. సిఎం ఇంటికి సమీపంలోనే ఇసుక క్వారీ ఒకటి ఉండేది. భద్రతా కారణాల దృష్ట్యా దాన్ని నిలిపివేశారు. సిఎం ఇంటికి ఇరువైపులా ఉన్న పొలాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగా ఉన్న భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. ఇలాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస గృహం ఉండడం గమనార్హం. ఈ నివాస గృహానికి భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. కృష్ణా నదీ పరీవాహక ప్రదేశం నుంచి ఎవ్వరూ చొచ్చుకు రాకుండా ఉండేందుకు మెరైన్ పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. మార్గం గుండా ముఖ్యమంత్రిని తన నివాస గృహంలో కలిసేందుకు అనుమతి ఉన్న విఐపిలు, వివిఐపిలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఉండవల్లి నుంచి సిఎం ఇంటి వైపు వెళ్లే మార్గంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కరకట్ట మీద నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారిని యక్ష ప్రశ్నలు వేసి మరీ వదులుతున్నారు. ఇక్కడ పోలీసుల తీరును స్థానికులు ఇప్పటికే నిరసిస్తున్నారు. ఇక మంతెన సత్యనారాయణ ప్రకృతి చికిత్సాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. ఇంటికి చుట్టూ పెద్ద సంఖ్యలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే బాంబ్ స్క్వాడ్ టీమ్‌లు పంట పొలాల్లో తనిఖీలు చేస్తున్నారు.