రాష్ట్రీయం

భక్తులకు అందుబాటులోకి అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 25: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల శుక్రవారపు తోటలో అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని భక్తులకు అందుబాటులోనికి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారపు తోటలో పద్మావతి పరిణ యం పేరిట ఏర్పాటు చేసిన ఫ్రేములను శనివారం తిరుపతి జే ఈ వో లక్ష్మీకాంతంతో కలసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా జే ఈ వో మీడియాతో మాట్లాడుతూ గూగుల్ ప్లేస్టోర్ నుం డి పద్మావతి పరిణయం పేరిట గల యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ ఫ్రేములను తిలకించవచ్చునన్నారు. ఫ్రేములను స్కాన్ చేస్తే పెయింటింగ్‌లోని బొమ్మలు మాట్లాడేలా ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 30ఫ్రేములున్నాయని, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ ఘట్టం వృత్తాంతాన్ని తెలియజేశారని వివరించారు. సందర్భానుసారం ఆకాశరాజు , శ్రీనివాసులు, శ్రీపద్మావతి, శ్రీశుక మహర్షి, కుబేరుని చిత్రాలు ఆయా పాత్రల ఔచిత్యాన్ని తెలియజేస్తాయన్నారు. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి జననం, నామకరణం, బాల్యం, పరిణయం తదితర ఘట్టాలు ఉన్నాయని తెలిపారు. 15నిమిషాల వ్యవధిలో అమ్మవారి పరిణయ ఘటాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాటు చేపట్టామన్నారు.
యాప్‌ను ఉపయోగించే విధానం
* స్మార్ట్ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా పద్మావతి పరిణయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* క్యూ అండ్ కోడ్‌ను స్కాన్‌చేసి కూడా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చును. చిత్రపటం ముందు 6 అడుగుల దూరంలో నిలబడి యాప్ ద్వారా ఫ్రేమ్‌లను స్కాన్ చేసి సన్నివేశాన్ని వీక్షించవచ్చు.
* యాప్‌ను ఉపయోగించేటపుడు హెడ్‌ఫోన్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.
భక్తుల కోసం సెల్లార్
ఆలయం వద్ద గల పాత అన్నదాన భవనంలో ఏర్పాటు చేసిన సెల్లార్‌ను ఈవో, జే ఈవో కలసి భక్తులకు అందుబాటులోనికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఎండకు , వర్షానికి ఇబ్బందులు పడకుండా 600మంది కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేపట్టామన్నారు. సెల్లార్‌లో కుంకుమార్చన టికెట్ కౌంటర్‌తో పాటు, రూ.100, రూ.20 టికెట్ కౌంటర్లు, ఆర్ ఓ తాగునీటి వసతి ఏర్పాటు చేశామని, శ్రీపద్మావతి అమ్మవారి అష్టోత్తరనామావళిని సంస్కృతం, తెలుగులో అర్థాలతో ప్రదర్శించామన్నారు. టీటీడీకి చెందిన 40 ఆలయాల ఫోటోలు, ప్రాశస్థ్యాన్ని, దర్శన వేళలు, ఆర్జిత సేవల వివరాలను టీవీల్లో ప్రదర్శిస్తున్నామని, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు కూడా అందిస్తున్నామని వివరించారు. రానున్న కాలంలో పద్మపుష్కరిణిలో లేజర్‌షో ఏర్పాటు చేస్తామని , వాటర్‌వాల్‌లో అమ్మవారి జననం, స్వామివారి గమనం అంశాలను ప్రదర్శిస్తామని తెలిపారు.