రాష్ట్రీయం

ఆత్మీయ స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని మట్టికరిపించి 151 అసెంబ్లీ సీట్లతో, 22 ఎంపీ సీట్లలో విజయ దుందుభి సాధించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మంత్రులు ఎదురేగి స్వాగతం పలికారు. కారు దిగిన వెంటనే జగన్‌కు భారీ బొకేను కేసీఆర్ ఇచ్చి అభినందనలు తెలిపారు. పక్కనే ఉన్న వైఎస్ భారతిని లోపలికి రామ్మా అంటూ ఆత్మీయంగా పలిచారు కేసీఆర్. తెలంగాణ సీఎం, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఆలింగనం చేసుకున్నారు. జగన్ దంపతులను ప్రగతి భవన్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ యువనేత జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్ మిఠాయి తినిపించారు. వైకాపా అధినేతకు శాలువాకప్పి సత్కరించారు. వీణను జ్ఞాపికగా బహూకరించారు.
ఈ సందర్భంగా జగన్‌కు తన కుటుంబ సభ్యులను, మంత్రులను కేసీఆర్ పరిచయం చేశారు. అడుగడుగున జగన్ దంపతులను అతిథి మర్యాదలతో ఉబ్బి తబ్బిబ్బులను చేశారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా జగన్‌ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులందరూ జగన్‌కు కరచాలనం చేస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ ముందుకుసాగారు.
అనంతరం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాను ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నానని తెలంగాణ సీఎంకు తెలిపారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేకంగా వేసిన కుర్చీల్లో జగన్, కేసీఆర్, మంత్రులు ఆసీనులయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని అభివృద్థిని సాధిద్దామని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇరురాష్ట్రాల ఎంపీలు లోక్‌సభలో ఆంధ్ర, తెలంగాణ సమస్యలపై వాణిని వినిపించాలని సూచించినట్లు సమాచారం.
ప్రగతిభవన్‌లో వైఎస్ జగన్, భారతి దంపతులు దాదాపు45 నిమిషాలు సేపు గడిపారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపుజగన్ ఉల్లాసంగా కనిపించారు. ఏపీ కాబోయే సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభ సభ్యుడు మిథున్ రెడ్డి ఉన్నారు.