రాష్ట్రీయం

30న జగన్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్రకు రెండవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. జగన్‌తో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో అన్న ఉత్కంఠకు ఆ పార్టీ సీనియర్ నేత, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరదించారు. జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సజ్జల ప్రకటించారు. శనివారం వైకాపా ఎమ్మెల్యేలంతా సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని ఆయన శుక్రవారం తెలిపారు. అనంతరం గవర్నర్‌ను కలుస్తారని తెలిపారు. కాగా, ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక ఇంకా ఖరారు కాలేదు. తొలుత విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్ ప్రతిపాదించారు. కానీ ట్రాఫిక్ సమస్య తలెత్తుందని అధికారులు వివరించడంతో ఆ ప్రతిపాదననను విరమించుకున్నారు. ప్రస్తుతం విజయవాడ సమీపంలోని చినఅవుటుపల్లి వద్ద సిద్ధార్ధ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారోత్సవ వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 7 లక్షల మంది వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 20 ఎకరాల స్థలం అవసరం అవుతుందని భావించి వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.