రాష్ట్రీయం

గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రూ.69,687కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం, విమానాశ్రయాలు, ఓడరేవులను కలుపుతూ రహదారుల కనెక్టివిటీకి 69,687 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, విభజన చట్టంలో అంశాలను అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన నారాయణ్‌తో వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సీఎస్ ఎల్వీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా ఉమ్మడి ఏపీలో ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాజధాని, ఆర్థికంగా అభివృద్ధి చెందిన నగరం లేకుండా నూతన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందన్నారు. అప్పులు జనాభా ప్రాతిపదికన, ఆస్తులు ప్రాంతాల వారీగా కేటాయించారని, దీని వల్ల ఏపీకి మరింత నష్టం వాటిల్లిందని వివరించారు. రాబోయే ఐదేళ్ల కాలానికి రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 4.79 లక్షల కోట్లు ఇవ్వాలని కోరారు. పారిశ్రామిక రంగం, సేవల రంగంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, కేరళ కంటే ఏపీ వెనుకబడి ఉందన్నారు. 2017-18లో తలసరి ఆదాయంలో తెలంగాణ 1,81,034 రూపాయలు, తమిళనాడు 1,66,934, కర్నాటక 1,81,788, కేరళ 1,80,518, ఉండగా, ఏపీ 1,42,053 రూపాయలతో వెనుకంజలో ఉందన్నార. ఇదే సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి లెక్కల ప్రకారం తయారీ, సేవల రంగంలో దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అట్టడగున ఉందన్నారు. ఇంతటి ఇబ్బంది కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలు, శిశు మరణాలకు అడ్డుకట్టవేయడంలోనూ, జీవన ప్రమాణాల పెంపులోనూ ఏపీ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆదాయ లోటు భర్తీతోపాటు రాష్ట్రంలో వౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అవసరమని వివరించారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మేంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టంలో కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి చేయూత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని కోరారు. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా, 1971 జనాభా ప్రాతిపదికన 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని కోరారు. రాజధాని నిర్మాణానికి 37,437 కోట్ల రూపాయలు, 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 22,250 కోట్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులను కలుపుతూ రహదారుల కనెక్టివిటీకి 10 వేల కోట్లు కలిసి 69,687 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థలకు 1000 రూపాయలు తలసరి ఆదాయంగా గుర్తించి నిధులు కేటాయించాలన్నారు. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకూ నిధులు కేటాయించాలన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 15న వెనకబడిన జిల్లాలకు 350 కోట్లు మంజూరు చేసి, తిరిగి కేంద్రం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. ఆ మొత్తాన్ని తక్షణమే మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందని, తుపాన్లు రావడం సర్వసాధారణమైందన్నారు. ఏపీలో విపత్తు వల్ల కలిగే నష్టాలను కేంద్రమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐజీఎస్టీలో మిగిలిన నిధులను రాష్ట్రాలకు పంచిపెట్టాలన్నారు. విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు కేటాయించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్య రాజ్ కోరారు.

చిత్రం..15వ ఆర్థికసంఘం సభ్యుడు నారాయణన్‌తో సమావేశమైన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆర్థిక శాఖ అధికారులు