రాష్ట్రీయం

ఏపీలో పరిణామాలపై సీఈసీ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆరా తీసింది. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదికను, ఈనెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మధ్య జరిగిన సంభాషణ వీడియోను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు వైకాపా ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సీఈసీ నివేదిక కోరింది. రాష్ట్ర డీజీపీ అందచేసిన నివేదికను సీఈసీకి ద్వివేది పంపారు. ఈ నెల 10న వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ద్వివేదికి వినతిపత్రం ఇవ్వడం, అక్కడ ధర్నాకు దిగడం తెలిసిందే. ఈ సందర్భంగా ద్వివేది, చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన సంభాషణ వీడియోను ఇంగ్లీషులోకి అనువదించి ఈసీకి ద్వివేది పంపారు. పోలింగ్ ముగిసి, ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడాల్సిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు, వేసవిలో మంచినీటి కార్యాచరణ, రాజధాని అమరావతిలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడంపై కూడా ఈసీ దృష్టి సారించినట్లు తెలిసింది. శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించేందుకు గురువారం నిర్ణయించినప్పటికీ, దానికి హోంమంత్రి నిర్వహించటం గమనార్హం. హాంశాఖ కార్యదర్శి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని మంత్రికి వివరించారు.